శంషాబాద్ రూరల్, జూలై 13 : పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను శంషాబాద్ పోలీసులు ఆరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన ఆదివారం జరిగింది. సీఐ నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శంషాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తొండుపల్లిలోని 5స్టార్గ్రాండ్ హోటల్లో కొంతమంది పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు.
పేకాడుతున్న ఆరుగురు వ్యక్తులని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న 3,210 రూపాయల నగదుతో ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తొండుపల్లికి చెందిన అంజయ్య, ఊటుపల్లికి చెందిన ప్రదీప్, జైపాల్,ఎం రాజు, కిషన్‌గూడకు చెందిన కొండరాజు, బాలపూర్‌కు చెందిన నిఖిల్‌కుమార్, హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌కు చెందిన తిరుపతిరావులను ఆరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన్నట్లు తెలిపారు.