Mahashivaratri | కందుకూరు, ఫిబ్రవరి 26 : కందుకూరు మండలంలో శివపార్వతు కళ్యాణం ఎంతో వైభవంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని చెన్నకేశవ ఆలయంతో పాటు ముచ్చర్ల గ్రామంలో హరిహర క్షేత్రంలో మహాశివరాత్రి పురస్కరించుకొని భక్తులు శివపార్వతుల కళ్యాణం చేశారు. వివిధ రకాల హోమాల్ని నిర్వహించిన అనంతరం కళ్యాణ మండపానికి శివపార్వతులను తీసుకొచ్చి వేద పండితుల మంత్రోచ్ఛరణాల నడుమ శంకరుడు పార్వతి మెడలో మంగళ సూత్రం కట్టాడు. కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
ఆలయాలు కిటకిట
మహాశివరాత్రి పురస్కరించుకొని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచి ఉపవాస దీక్షలో ఉన్న భక్తులు సాయంత్రం దేవాలయాలకు వెళ్లి శివలింగాలకు అభిషేకాలు చేసి పండ్లతో దీక్షను విరమించారు. రాత్రంతా జాగరణ చేయనున్నారు.