Shadnagar : యువకులు సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి.. జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్

షాద్‌నగర్ : నేటి తరం యువకులు ప్రజా సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శనివారం తన కార్యాలయంలో యువజ విభాగం శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యువతను మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు అన్ని ప్రాంతాల్లో యూత్ క్లబ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. మాదక ద్రవ్యాలు, చెడు వ్యసనాలకు బానిసలు కాకుండ యువతకు మార్గనిర్ధేశం చేసేలా క్లబ్‌లు పని చేయాలని కోరారు. గ్రామీణ స్థాయి నుంచి నగర స్థాయి వరకు యువకలు సేవా రంగాల్లో రాణించాలని చెప్పారు.
గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా యువతి, యువకుల్లో నైపుణ్యం పెంచేలా శిక్షణ తరగతులను నిర్వహించాలన్నారు. శారీరక వ్యాయమంలో భాగంగా అనువైన చోట 2కె, 5కె రన్ , క్రీడలు, పరుగు పందెం వంటి కార్యక్రమాలను చేపట్టాలని తెలిపారు. రక్తదానం, అవయవదానం, వైద్య శిబిరాల్లో యువకులు ఆసక్తి చూపేలా ప్రోత్సహించాలన్నారు. స్వచ్ఛతాహి సేవా 2021లో భాగంగా శ్రమదానం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో యువజన విభాగం జిల్లా అధికారి ఐసయ్య, డీఆర్డీఏ పీడీ ప్రభాకర్, క్రీడ విభాగం జిల్లా అధికారి వెంకటేశ్వర్లు, సంక్షేమ శాఖ అధికారిని మోతి, రెడ్‌క్రాస్ ప్రతినిధి నర్సింహరెడ్డి, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

