సీనియర్ సివిల్‌జడ్జి ఇందిర
ఇబ్రహీంపట్నంరూరల్, ఫిబ్రవరి 29 : విద్యార్థులు బాల్యదశ నుంచే ధైర్యం, ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని రంగారెడ్డిజిల్లా లీగల్ అథారిటీ సెక్రటరీ, సీనియర్ సివిల్‌జడ్జి ఇందిరా అన్నారు. మండల పరిధిలోని ఉప్పరిగూడ ప్రభుత్వ యూపీఎస్ పాఠశాలలో చైల్డ్ చాప్టర్ అసోసియేషన్ నిర్వాహకులు షైక్ జాకీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ… చిన్నపిల్లలను బాధ్యతగా చూసుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై ఎంతో ఉందన్నారు.
ముఖ్యంగా విద్యార్థులు ధైర్య సాహసాలు పెంపొందించినప్పుడే వారు ఎంతో ముందుకు సాగుతారన్నారు. ఈ సందర్భంగా చైల్డ్ చాపర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తయారుచేసిన చైల్డ్ స్టోరీ బుక్‌ను ఆమె ఆవిష్కరించి విద్యార్థులకు అందించారు. ఈ పుస్తకంలో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చిన్నతనం నుంచి అలవర్చుకోవాల్సిన విధానానికి సంబంధించిన వివరాలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నారాయణరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.