రంగారెడ్డి, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఆధునిక యుగంలో అంతరించిపోతున్న ప్రా చీన కళలకు ప్రాణం పోసేందుకు జిల్లా యువజన, క్రీడాశాఖ కృషి చేస్తున్నది. జిల్లా స్థాయి లో యువజన ఉత్సవాలను నిర్వహిస్తున్నది. ఇందుకు జిల్లాలోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వేదిక కానున్నది. ఈనెల 22న ఉద యం 9నుంచి సాయంత్రం 5 గంటల వరకు 9 విభాగాల్లో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన కళాకారులు రాష్ట్రస్థాయిలో ఆ తర్వాత జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది.
యువ కళాకారులకు మంచి అవకాశం..
27వ జాతీయ యువజనోత్సవాల సందర్భంగా ఈ ఏడాది జిల్లాస్థాయిలో నిర్వహిస్తున్న ఉత్సవా లు యువ కళాకారులకు మంచి అవకాశం వం టిది. 15 ఏండ్ల నుంచి 29 ఏండ్ల లోపు వయసు కలిగిన వారికి ఇందులో పాల్గొనే అవకాశం ఉం టుంది. జానపద సంగీతం(గ్రూప్), జానపద సంగీతం, జానపద నృ త్యం(గ్రూప్), జానపద నృత్యం, కథ రచన, పోస్టర్ మేకింగ్, వకృ్తత్వ, ఫొ టోగ్రఫీ తదితర విభాగా ల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ఎంపికైన కళాకారులు వచ్చే ఏడాది జనవరిలో జరుగనున్న జాతీయ స్థాయి యువజనోత్సవా ల్లో పాల్గొనేందుకు అవకాశం కలుగుతుంది. దేశ భక్తి, సందేశాత్మకంగా ఉండే అంశాలను ఎంచుకోవాలని జిల్లా యువజన, క్రీడల అధికారి కోరుతున్నారు. dysorangareddy@gmail.com mailto:dysorangareddy@gmail.comమెయిల్‌కు పంపించాలన్నా రు. ఇతర వివరాలకు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలోని క్రీడల కార్యాలయాన్ని, సెల్ నంబర్లు 9848364143, 9849909077ల ను సంప్రదించాలన్నారు.