ధారూర్, ఫిబ్రవరి 25: ఆపదలో ఉన్న మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా న్యాయసేవా అధికార సంస్థ సెక్రటరీ సీతల్ అన్నారు. శనివారం మండలంలోని మున్నూర్‌సోమారం గ్రామంలో జరిగిన చట్టాలపై అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళల సంరక్షణకు అనేక చట్టాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆపదలో మహిళలు ఉన్నట్లు తెలిస్తే పోలీసులు, సంబంధిత అధికారులకు సమాచారం అందించి వారికి రక్షణ కల్పించాలని ప్రజల కు సూచించారు.
బాలల సంరక్షణపై కూడా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మాధవరెడ్డి, జిల్లా న్యాయ సేవాఅధికార సంస్థ చీఫ్ డిపెన్స్ కౌ న్సిల్ వెంకటేశ్, న్యాయవాదులు రాజశేఖర్, రమేశ్, ఎస్ఐ సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.