Sri Rama Navami | శ్రీరామ నవమి ఉత్సవాలు.. రమణీయంగా రథోత్సవం
శ్రీరామ నవమి ఉత్సవాలను (Sri Rama Navami) పురస్కరించుకొని పెద్దశంకరంపేటలో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం వేకువ జామున వరకు శ్రీ సీతారాముల రథోత్సవం అంగరంగ వైభవంగా, రమణీయంగా నిర్వహించారు.
పెద్దశంకరంపేట, ఏప్రిల్ 08: శ్రీరామ నవమి ఉత్సవాలను (Sri Rama Navami) పురస్కరించుకొని పెద్దశంకరంపేటలో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం వేకువ జామున వరకు శ్రీ సీతారాముల రథోత్సవం అంగరంగ వైభవంగా, రమణీయంగా నిర్వహించారు. రథం ముందు వేదబ్రాహ్మణులచే హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారాముల, లక్ష్మణ విగ్రహాలను రథంపై ఉంచి పట్టణ పురవీధులగుండా రథాన్ని ఊరేగించారు. రథంను కాషాయ జెండాలతో, రకరకాల పూలతో పాటు, మామిడి తోరణాలతో అందంగా అలంకరించారు.
యువకులు, పెద్దలు జైశ్రీరాం, జైజై శ్రీరాం అంటూ నినాదాలు చేస్తూ స్థానిక రామాలయం నుంచి పట్టణ పురవీధులగుండా భవానీ మాత ఆలయ కమాన్ వరకు రథాన్ని ఊరేగించారు. మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి మంగళ హారతులతో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుజ్జరి కనకరాజు, కందుకూరి రవిందర్, ఆలయ కమిటీ సభ్యులు జంగం శ్రీనివాస్, సుభాశ్‌గౌడ్, రాగం సిద్దు, శ్రీను, ఆర్ఎస్ సంతోష్, అన్నారం సత్యనారాయణ, గంగారెడ్డి, ఆర్ఎన్ సంతోష్ కుమార్, గ్రామ పెద్దలు, ఆయా కులసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

