నేడు లష్కర్ బోనాలు.. రేపు రంగం.. అంబారీపై అమ్మవారి ఊరేగింపు
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఆగస్టు 2 ఆదివారం అమ్మవారికి బోనాలు, 3న రంగం, అంబారీపై అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయని ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి తెలిపారు.
బేగంపేట్, ఆగస్టు 1 : సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఆగస్టు 2 ఆదివారం అమ్మవారికి బోనాలు, 3న రంగం, అంబారీపై అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయని ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వం తరఫున ఉదయం 3.30 అమ్మవారికి బోనం సమర్పించిన అనంతరం 4 గంటల నుంచి భక్తులు దర్శించుకునేందుకు, బోనాలు సమర్పించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు.
అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే సాధారణ భక్తులకు మూడు క్యూలైన్లు, అలాగే బోనాల సమర్పించే మహిళలకు వేరుగా 2 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అలాగే వీఐపీ లకు కూడా మరో క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేశారు. బందోబస్త్‌లో సుమారు 15 వందల మంది పాల్గొంటున్నట్టు పోలీస్ అధికారులు తెలిపారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వద్దు : ఎమ్మెల్యే తలసాని
ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ దక్కన్ మానవ సేవా సమితి సభ్యులను కోరారు. శనివారం వారితో మారేడ్‌పల్లిలోని క్యాంపు కార్యలయంలో సమావేశమై సమితి సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అలాగే క్యూలైన్లలోనూ వచ్చే భక్తులకు దగ్గరుండి సేవలు అందించాలని సూచించారు. దక్కన్ మానవ సేవా సమితి స్థాపించి వందేళ్లు పూర్తి అయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాల పేరుతో తయారు చేయించిన షీల్డ్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

