కేశంపేట, జులై 20 : ప్రపంచాన్ని సన్మార్గంలో నడిపే శక్తి ఒక్క విద్యకు మాత్రమే ఉందని సికింద్రాబాద్ జూనియర్ ఛాంబర్స్ చారిట్రబుల్ ట్రస్ట్ చైర్మన్ నాగశ్రీధర్ అన్నారు. సమ సమాజ నిర్మాణంలో విద్యార్థులు, యువత భాగస్వాములు కావాలని రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బెంచీమార్క్ – త్రీ ప్రోగ్రాంలో భాగంగా 40బెంచీలను అందజేశారు.
ఈ సందర్భంగా నాగశ్రీధర్ మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్నతనం నుంచే మంచి క్రమశిక్షణను అలవర్చుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు చెప్పిన విషయాలను శ్రద్ధగా విని ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. మంచి క్రమశిక్షణతో మెలుగుతూ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతోపాటు గ్రామానికి మంచి గుర్తింపు తీసుకురావాలన్నారు.