అబ్దుల్లాపూర్మెట్ : నగర శివారులోని అబ్దుల్లాపూర్మెట్ పరిసర ప్రాంతాల్లో న్యూయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం తెల్లవారుజాము నుంచి అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని గ్రామాల్లో కొత్త సంవత్సరం వేడుకల సందడి ప్రారంభమైంది. మహిళలు కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని తమ ఇళ్ల ముందు అందమైన ముగ్గులు అలంకరించడంలో నిమగ్నమయ్యారు.
కిక్కిరిసిన ఆలయాలు, పర్యటక కేంద్రాలు
కొత్త సంవత్సరం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆలయాలకు వెళ్లడం ఆనవాయితీ అందులో భాగంగా చిన్న, పెద్ద మహిళలు అనే తారతమ్యం లేకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆలయాలకువెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. అదే విధంగా సంఘీ, అనాజ్పూర్, బాటసింగారం, దేశ్ముఖ్ ప్రాంతాల్లో పర్యటక కేంద్రాలు కిక్కిరిసిపోయాయి. నగరంలోని యువతీ, యువకులు శివారులకు తరలివచ్చి నూతన సంవత్సర సంబురాలను సందడిగా జరుపుకున్నారు. ముఖ్యంగా రామోజీఫిలిం సిటి, సంఘీ టెంపుల్, మౌంట్ ఒపెరా, సాయిబృందావనం జనసందోహంగా మారాయి.