బిల్లులు వసూలు చేస్తేనే జీతాలు
జీహెచ్ఎంసీలో విచిత్ర పరిస్థితి నెలకొన్నది.. ప్రభుత్వ ఉద్యోగులకు 1న జీతాలు ఇస్తున్నామని సర్కారు గొప్పలు చెబుతుంటే...వచ్చే నెలలోనైనా కనీసం 1న ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని ప్రతి నెలా చివరి వారంలో బల్దియా ఆరాటపడుతున్నది.
- ఉద్యోగుల వేతనాలకు జీహెచ్ఎంసీ వెంపర్లాట
- కనీసం రూ.100కోట్లయినా వసూలు చేయండి
- బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లపై ఉన్నతాధికారుల ఒత్తిడి
జీహెచ్ఎంసీలో విచిత్ర పరిస్థితి నెలకొన్నది.. ప్రభుత్వ ఉద్యోగులకు 1న జీతాలు ఇస్తున్నామని సర్కారు గొప్పలు చెబుతుంటే…వచ్చే నెలలోనైనా కనీసం 1న ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని ప్రతి నెలా చివరి వారంలో బల్దియా ఆరాటపడుతున్నది. కానీ జీహెచ్ఎంసీ ఆర్థిక విభాగం ఆరాటం.. ఆచరణలో సాధ్యపడడం లేదు.. దీనికి కారణం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న బల్దియాను ఆదుకోవడంలో ప్రభుత్వం ‘చే’తులెత్తేయడమే.. ఈ పరిస్థితుల్లో ఖజానాను స్వతహాగా బలోపేతం చేసుకునేందుకు ఆస్తిపన్ను వసూలు చేస్తేనే జీతాలు ఇస్తామంటూ కొత్త రాగం ఎత్తుకోవడం ఉన్నతాధికారులకే చెల్లింది.
-సిటీబ్యూరో, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ)
ఆస్తిపన్ను వసూళ్లలో..
జీహెచ్ఎంసీ ఖజానా నానాటికీ బక్కచిక్కిపోతున్నది.. వాస్తవంగా సంస్కరణలతో ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్ల మెరుగుదల, నిర్మాణ రంగ అనుమతుల ద్వారా ఆదాయం, ఖర్చుల భారం తగ్గించుకోవడం..కానీ ఆస్తిపన్ను వసూళ్లలో కొందరు బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్ల చేతివాటం, రెసిడెన్షియల్ నుంచి కమర్షియల్ కేటగిరీలోకి మారిన భవనాలపై ఫోకస్ చేయకపోవడం, కొత్త భవనాల అసెస్మెంట్లో నిర్లక్ష్యం , దాదాపు రూ. 6,900 కోట్ల ఆస్తిపన్ను బకాయిల రాబడిలో పనితీరు శూన్యమనే చెప్పాలి. ఇక గతంలో కంటే నిర్మాణ రంగ అనుమతులు తగ్గడం, ఇప్పటి వరకు రూ.200 కోట్ల మేర లోటు ఏర్పడింది. ఇక ఖర్చుల భారం తగ్గించుకోవాల్సిన సమయంలో ఒకవైపు కార్పొరేటర్లు ఇతర రాష్ర్టాల్లో అధ్యయనం పేరిట టూర్లు వేయగా, దాదాపు రూ.కోటిన్నర ఖర్చు కావడం కొసమెరుపు.
గాడి తప్పిన పాలన
కమిషనర్ నుంచి ఉన్నతాధికారుల పర్యవేక్షణలో లోపంతో జీహెచ్ఎంసీ పాలన గాడి తప్పింది. పౌరుల మౌలిక సదుపాయాల కల్పన దేవుడెరుగు, ఉద్యోగుల నెలవారీ వేతనాలు సకాలంలో వచ్చే పరిస్థితులు లేవు. ప్రతి నెలా ఉద్యోగుల జీతాల చెల్లింపులకు ఆర్థిక విభాగం నానా తంటాలు పడుతున్నది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఉన్నతాధికారులు ఆస్తిపన్ను బకాయిలు, నెలవారీ టార్గెట్లు పూర్తి చేయాలంటూ బిల్ కలెక్టర్లు , ట్యాక్స్ ఇన్స్పెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 31వ తేదీలోగా రూ. 100కోట్లు వసూలు చేయాలని, అలా చేస్తేనే జీతాలు వస్తాయంటూ ఉన్నతాధికారులు ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలోనే గత నెల 5న జీతాలు ఇచ్చిన బల్దియా.. పండుగ మరుసటి రోజైనా వేతనాలు వస్తాయా? వచ్చే నెలలో ఎప్పుడు ఇస్తారో అన్న చర్చ ఉద్యోగుల్లో జరుగుతున్నది.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

