నిబంధనలు పాటించాలి.. సీఐ ఉపేందర్

ఆమనగల్లు : ప్రభుత్వ నిబంధనలు పాటించి వినాయక మండపాలను ఏర్పాటు చేసుకోవాలని ఆమనగల్లు సీఐ ఉపేందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల మండల కేంద్రాలతో పాటు గ్రామాలల్లో వినాయక మండపాలను ఏర్పాటు చేసుకునేందుకు నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకొని సంబంధిత పోలీస్ స్టేషన్లో దరఖాస్తును సమర్పించాలని సూచించారు.
అట్టి దరఖాస్తును పరిశీలించి మండపాల ఏర్పాటు కోసం ఉన్నతాధికారుల ఆదేశానుసారం అనుమతి ఇస్తామని తెలిపారు. నిబంధనలు పాటించకుండా అనుమతి లేకుండా మండలపాలను ఏర్పాటు చేస్తే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండపాల ఏర్పాటు చేసుకునేవారంతా కింది నిబంధనలు పాటించాలి.
- మండపాల వద్ద 24గంటల పాటు ఒక్కరూ తప్పనిసరిగా పర్యవేక్షణ చేపట్టాలి.
- మండపాలను పటిష్టంగా ధృడంగా ఏర్పాటు చేసుకొని విద్యుత్ షార్ట్‌సర్క్యుట్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
- ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మండపాలను ఏర్పాటు చేయాలి.
- ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై ఏర్పాటు చేయకూడదు.
- మండపాల వద్ద అగ్నిమాపక వస్తువులు అందుబాటులో ఉంచుకోవాలి.
- మండపాలను భూ తగాదలు ఉన్న చోట ఏర్పాటు చేయకూడదు.
- డీజేల ఏర్పాటుకు అనుమతిలేదు.
- రాత్రి పదిగంటల తరువాత ఎలాంటి సౌండ్ సిస్టమ్ ఉపయోగించరాదు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

