కులకచర్ల, ఫిబ్రవరి 21 : సీఎం రేవంత్రెడ్డి స్థానిక పూజారులను అవమానించారని రాష్ట్ర అర్చక పురోహిత సంక్షేమ సంఘం సభ్యుడు మఠం రాజశేఖర్ అన్నారు. శుక్రవారం పోలేపల్లి ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవాలకు హాజరైన ముఖ్యమంత్రి ఆలయం లో స్థానిక పూజారులను పూజ చేసేందుకు అనుమతించలేదన్నారు.
హైదరాబాద్ నుంచి పురోహితులను తీసుకొచ్చి వారితో పూజలు చేయించి ఇక్కడి అర్చకులను అవమానించారన్నారు. అక్కడ నిత్యం పూజాకార్యక్రమాలు నిర్వహించే అర్చకులను అవమానించడాన్ని రాష్ట్ర అర్చక సమాఖ్య ఖండిస్తుందన్నారు.