తాండూరు : మార్వాడి యువమంచ్ తాండూరు శాఖ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని బాలాజీ మందిరంలో కొనసాగుతున్న ఉచిత జైపూర్ కాళ్ల అమరిక, కెలిపర్ శిబిరమును గురువారం జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న స్థానిక కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నేతలు సందర్శించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల ద్వార 250మంది వరకు వైద్యశిబిరంలో పాల్గొని చికిత్సలు, జైపూర్ కాళ్ల అమరికలు చేయించుకుంటున్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ మాట్లాడుతూ సమాజంలో మార్వాడి యువమంచ్ చేస్తున్న సేవలు అమోఘం అన్నారు.
రూ. లక్షల విలువ గల వైద్యచికిత్సలు ఉచితంగా నిర్వహించి పేదలకు సేవలు చేయడం చాల సంతోషమని నిర్వాహకులను అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్వాడి యువమంచ్ ప్రతినిధులు ఉన్నారు.