నందిగామ : ప్రమాద సమయంలో ఎలా స్పందించాలో వాటిని ఎలా ఎదుర్కొవాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శుక్రవారం మండలంలోని నాట్కో పరిశ్రమలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాదాలు సంభవించడానికి అవకాశమున్న ప్రదేశాలు, రసాయనాలను గుర్తించడం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాలు చోటు చోటుచేసుకున్న సమయంలో వ్యవహరించాల్సిన తీరు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను నాట్కో సిబ్బందికి కండ్లకు కట్టినట్లు ప్రత్యేక్షంగా చేసి చూపించారు.
కార్యక్రమంలో పరిశ్రమ శాఖ జిల్లా అధికారి ప్రతిమ, ఏడిఈవో శ్రీనాథ్, ఎన్డీఆర్ఎఫ్ కమాండో సాగర్, గౌతమ్‌కుమార్, నాట్కో పరిశ్రమ ప్రతినిధులు ప్రసాద్, శ్రీనివాస్‌రావు, సత్యనారాయణ, పోలీసు సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.