పెద్దఅంబర్‌పేట : సమాజంలో ప్రజలందరూ న్యాయ సేవలపై అవగాహన పెంచుకోవాలని, చట్టాలపై అవగాహన కల్గి ఉంటే సరైన సమయంలో సరైన న్యాయం దొరుకుతుందని మెట్రొపాలిటన్ సీనియర్ సివిల్ జడ్జి చందన అన్నారు. ఆదివారం మున్సిపాల్టీ పరిధిలోని కుంట్లూర్ వార్డు కార్యాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానికులతో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చట్టాల మార్పులపై, న్యాయ సేవలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. అనంతరం గ్రామ ప్రజలకు న్యాయ సేవలపై ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు.
ఈ సమావేశంలో సీనియర్ అడ్వకేట్ చామ రాంరెడ్డి, దండెం రాంరెడ్డి, హయత్‌నగర్ బార్ కౌన్సిల్ ప్రెసిడెండ్ కోటేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ సంపూర్ణారెడ్డి, ప్యానల్ అడ్వకేట్లు పీఏల్వి, రామ్మోహన్, ఎస్ఐ రాజు, కౌన్సిలర్లు, నాయకులు జోర్క శ్రీరాములు, న్యాయవాదులు, చుంచు బాల్‌రెడ్డి, నవీన్‌కుమార్ పాల్గొన్నారు.