Rangareddy : హైకోర్టు ఆదేశాల మేరకు సీజ్ చేసిన వాహనాల అప్పగింత

షాద్‌నగర్‌రూరల్ : డ్రంక్ అండ్ డ్రైవ్‌లో సీజ్ చేసిన వాహనాలను తిరిగి వాహన యజమానులకు ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు షాద్‌నగర్ ట్రాఫిక్ ఎస్ఐ రఘుకుమార్ సీజ్ చేసిన వాహనాలను యజమానులకు బుధవారం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018 నుంచి నేటి వరకు 5200 కేసులు నమోదు చేశామన్నారు. ఇందులో భాగంగానే 934 వాహనాలను సీజ్ చేశామని తెలిపారు. మా పరిధిలో ఉన్న వాహన చజమానులు పోలీస్ స్టేషన్‌కు వచ్చి వాహన ధ్రువపత్రాలను, వ్యక్తి వివరాలను చూపించి వాహనాలను తీసుకెళ్లాలని సూచించారు.
వాహనాల నిబంధనల విషయంలో నమోదు చేసిన కేసులు కోర్టు పరిధిలో ఉంటాయని, వాటిని పూచికత్తుపై తీసుకెళ్లాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, పాటించని వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

