పరిగి, సెప్టెంబర్ 16 : తెలంగాణ సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టి సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినందుకు శుక్రవారం పరిగిలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయాలన్నీ చారిత్రక నిర్ణయాలని కొనియాడారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును నూతన పార్లమెంటు భవనానికి పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేయడంతోపాటు రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం గొప్ప నిర్ణయమన్నారు. అంబేద్కర్ అందరివాడన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధనలో భాగంగా సీఎం కేసీఆర్ నేతృత్వం లోని ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా చూస్తున్నదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కరణం అరవిందరావు, జడ్పీటీసీ బి.హరిప్రియ, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ.సురేందర్, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాం సుందర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మేడిద రాజేందర్, సీనియర్ నాయకులు బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎస్.భాస్కర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మంగు సంతోష్, సర్పంచ్‌లు నల్క జగన్, రాంచంద్రయ్య, ఎంపీటీసీ కె.వెంకట్రాంరెడ్డి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కొడంగల్, సెప్టెంబర్ 16: తెలంగాణ సాధనలో డా.బీఆర్ అంబేద్కర్‌ది కీలక పాత్ర ఉందని, ఆయన రచించిన భారత రాజ్యంగంలోని ఆర్టికల్ 3లో చిన్న రాష్ర్టాల విభజనతో అభివృద్ధి అనే అంశం ఆధారంగా మనం తెలంగాణను సాధించుకున్నామని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడాన్ని స్వాగతిస్తూ అంబేద్కర్ విగ్రహానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యేతో పాటు ప్రజాప్రతి నిధులు కలిసి క్షీరాభిషేకం చేశారు.
ధారూరు,సెప్టెంబర్ 16: ధారూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మండల పార్టీ నాయకులు శుక్రవారం క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజునాయక్, ప్రధాన కార్యదర్శులు అంజయ్య, రాజుగుప్తా, నాయకులు సంతోష్‌కుమార్, రాములు, సత్యనారాయణ రెడ్డి, అంజయ్య, వెంకటయ్య, వీరేశం, నర్సింహులు, దేవేందర్, లక్ష్మయ్య, భీమ్సేన్ రావు, చంద్రమౌళి, రవీందర్ రెడ్డి, వెంకట్రామ్ రెడ్డి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
మోమిన్‌పేట, సెప్టెంబర్ 16: మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో సర్పంచ్ అలివేల మ్మ, శనైశ్చర ఆలయ కమిటీ చైర్మన్ మహిపాల్ రెడ్డితో కలసి మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు..కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు, ఉపా ధ్యక్షుడు చెన్నారెడ్డి, రమేశ్, మాజీ సర్పంచులు శ్రీరాములు, అనంతయ్య నాయకులు ఎల్లా రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, అంబేద్కర్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పూడూరు, సెప్టెంబర్ 16: రాష్ట్ర నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని ఎంపీపీ మల్లేశం, పీఏసీఎస్ సొసైటీ మాజీ చైర్మన్ నర్సింహారెడ్డి, ఉప సర్పంచ్ రాజేందర్ పేర్కొన్నారు. శుక్రవారం పూడూరు మండల కేంద్రంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం నిర్మించిన నూతన పార్ల మెంట్ భవనానికి అంబేద్కర్ పేరును పెట్టాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు అనంత రాములు, హరీశ్వర్‌రెడ్డి, నవీన్ తదితరులు ఉన్నారు.
కులకచర్ల, సెప్టెంబర్ 16 : నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి ప్రభుత్వం అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకోవడంపై కులకచర్ల, చౌడాపూర్ మండలాల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అంబేద్కర్ యువజన సంఘాల సభ్యులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కులకచర్లలో నిర్వహించిన కార్యక్రమంలో కులకచర్ల టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ హరికృష్ణ, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు రాజు, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య, మాజీ ప్రధాన కార్యదర్శి గుండుమల్ల నర్సింహులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు నర్సింహులు, వెంకటయ్యగౌడ్, వై రాములు, కనకం మొగులయ్య, కృష్ణ, వెంకటయ్య పాల్గొన్నారు. చౌడాపూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సత్తినేని సుధాకర్‌రెడ్డి, జడ్పీటీసీ రాందాస్‌నాయక్, ఏఎంసీ వైస్ చైర్మన్ నాగరాజు, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నర్సింహులు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
బొంరాస్‌పేట, సెప్టెంబర్ 16 : నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం పట్ల మండల అంబేద్కర్ యువజన సంఘం ఇన్చార్జ్ డప్పు శ్రీనివాస్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. అంబేద్కర్ పేరును రాష్ట్ర సచివాలయానికి పెట్టాలని సీఎం సముచిత నిర్ణయం తీసుకున్నారని అన్నారు.