షాద్‌నగర్‌టౌన్, సెప్టెంబర్ 15: నులిపురుగుల నివారణతో పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని ఎమ్మె ల్యే అంజయ్యయాదవ్ అన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం సందర్భంగా మున్సిపాలిటీలోని పద్మావతి కాలనీ జిల్లా పరిషత్ కుంట ఉన్నత పాఠశాల విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను గురువారం జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 1-19 సంవత్సరాల బాలబాలికలందరికీ నులిపురుగుల నిర్మూలన మాత్రలను తప్పకుండా వేయించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో జయలక్ష్మి, కౌన్సిలర్ బచ్చలి నర్సింహులు, ఎంపీటీసీ రామకృష్ణ, డాక్టర్ ఆనంద్, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్, హెచ్ఎం రమేశ్, నాయకులు కిశోర్, శరత్కృష్ణ, హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు.
నందిగామ : కొత్తూరు మున్సిపాలిటీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు నులిపురుగుల మాత్రలను ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పంపిణీ చేశారు. విద్యార్థులు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కడ్తాల్ : 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు విధిగా నులిపురుగుల నివారణ మాత్రలను వేయించాలని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నులిపురుగుల కారణంగా చిన్నారుల్లో రక్తహీనత, వ్యాధి నిరోధకశక్తి తగ్గుదల, శరీరం బలహీనం కావడం తదితర సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యుడు పరీక్షిత్ నరేంద్ర, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో రామకృష్ణ, డీటీ రాజశేఖర్, ఎంఈవో సర్దార్‌నాయక్, ఏంపీవో మధుసూదనాచారి, హెచ్ఎం విజయ, మైసిగండి సర్పంచ్ తులసీరాంనాయక్, వార్డు సభ్యులు నరేందర్‌రెడ్డి, సువర్ణ, జంగమ్మ, బుజ్జి పాల్గొన్నారు.
నివారణ మాత్రలు వేయించాలి : ఎమ్మెల్యే యాదయ్య
చేవెళ్ల రూరల్ : విద్యార్థులకు విధిగా నులి పురుగుల నివారణ మాత్రలు వేయించాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం చేవెళ్ల మండల పరిధి అంతారం గ్రామంలోని జడ్పీహెచ్ఎస్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు వేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, హెచ్ఎం మల్లేశం, రైతు సమన్వయ సమితి కౌకుంట్ల అధ్యక్షుడు నాగార్జున రెడ్డి, నాయకులు వెంకటేశ్ బాబు, పాషా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పెద్దఅంబర్‌పేట : మున్సిపాలిటీ పరిధిలోని పలు పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గురువారం నులి పురుగుల నిర్మూలన మాత్రలు వేసినట్లు చైర్పర్సన్ చెవుల స్వప్న తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ రామాంజులరెడ్డి, పీహెచ్సీ సిబ్బంది, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
మాత్రలు వేయించాలి : డిప్యూటీ డీఎంహెచ్‌వో
19 ఏండ్ల లోపు పిల్లలందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో నాగజ్యోతి, ఎంపీపీ కృపేశ్, వైద్యాధికారి అభిరాం అన్నారు. వివిధ గ్రామాల్లో నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు భరత్‌రెడ్డి, సర్పంచ్‌లు పవిత్ర, హంసమ్మ, యాదగిరి, ఎంపీటీసీ నాగమణి, ఉపసర్పంచ్ మునీర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బుగ్గరాములు పాల్గొన్నారు.
మంచాల : నోముల పాఠశాలలో విద్యార్థులందరికీ అల్బెండజోల్ మాత్రలను వైద్యాధికారులు అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం రాజిరెడ్డి, ఉపాధ్యాయులు బాల్‌రాజ్, మీనాక్షి, పంచాయతీ కార్యదర్శి దివ్య, ఏఎన్ఎం స్వప్న, ఆశవర్కర్ నవనీత, అంగన్వాడీ టీచర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
షాద్‌నగర్‌రూరల్ : ఫరూఖ్‌నగర్ మండలంలోని వివిధ గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచ్‌లు నులి పురుగుల నివారణ మాత్రలను వేశారు. పరిశుభ్రత పాటించాలని సూచించారు. జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
కేశంపేట : చిన్నారుల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని ఎంపీపీ రవీందర్‌యాదవ్ సూచించారు. మండల కేంద్రంతో పాటు కొత్తపేటలో 1-19 సంవత్సరాల పిల్లలకు నట్టల నివారణ మాత్రలను ఆయన పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ విశాల, సర్పంచ్‌లు నవీన్‌కుమార్, వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ మల్లేశ్, మండల కోఆప్షన్ మెంబర్ జమాల్‌ఖాన్ పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్ : మిర్జాగూడలో చిన్నారులకు నులి పరుగుల నివారణ మాత్రలను వేశారు. కార్యక్రమంలో సర్పంచ్ భీమయ్య, వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
ఆదిబట్ల : ఆదిబట్ల ప్రభుత్వ పాఠశాలలో నులి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం పరమేశ్, ఉపాధ్యాయులు బబ్లీ, పద్మావతి, అంగనవాడీ టీచర్లు బేమి, సుజాత, ఆశవర్కర్లు పాల్గొన్నారు.
మొయినాబాద్ : విద్యార్థులు తమ ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం అన్నారు. చిలుకూరు గ్రామ రెవెన్యూలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నులిపురుగుల మాత్రలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గునుగుర్తి స్వరూప, పాఠశాల ప్రిన్సిపాల్ శౌరిరాజు, వైస్ ప్రిన్సిపాల్ మోహన్శంకర్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
యాచారం : మండల వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రా లు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న పిల్లలకు నులిపురుగు నివారణ మాత్రలు వేశారు. యాచారంలో ఎంపీపీ సుకన్య, మాల్లో జడ్పీటీసీ జంగ మ్మ మాత్రలు వేశారు. సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
షాబాద్ : మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో వైద్యసిబ్బందితో కలిసి చిన్నారులకు సర్పంచ్ సుబ్రహ్మణ్యేశ్వరి నులిపురుగుల నివారణ మాత్రలు వేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం నర్సింహులు, ఉపాధ్యాయులు డేవిడ్‌రెడ్డి, రియాజ్, ప్రభాకర్‌రెడ్డి, వసుంధర, విద్యార్థులు తదితరులున్నారు.