ఇబ్రహీంపట్నంరూరల్, సెప్టెంబర్ 14 : భారతదేశంలో నిజాం సంస్థానం విలీనమై 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను నియోజకవర్గంలో ఘనంగా నిర్వహిద్దామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
16న ఇబ్రహీంపట్నం పాతబస్టాండ్ నుంచి పదివేల మందితో క్యాంపు కార్యాలయం గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ, 17న జాతీయ జెండాల ఆవిష్కరణ, 18న సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీలో యువత, విద్యార్థులు, మహిళలు, అన్ని శాఖల అధికారులు పాల్గొనే విధంగా సమీకరణ చేయాలన్నారు. సమావేశంలో ఏసీపీ ఉమామహేశ్వర్రావు, మున్సిపల్ కమిషనర్లు రామాంజులరెడ్డి, జ్యోతి, అమరేందర్‌రెడ్డి, యూసుఫ్, తహసీల్దార్లు రామ్మోహన్రావు, అనిత, సుచరిత, అనితారెడ్డి, ఎంపీడీవోలు మమతాబాయి, శ్రీనివాస్, విజయలక్ష్మి, జైరాంవిజయ్, మున్సిపల్ వైస్ చైర్మన్ యాదగిరి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్
టీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుత్బుల్లాపూర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త సందిల నందూగౌడ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న సర్పంచ్ ముద్దం స్వరూప, నాయకులు వీరస్వామి యాదవ్ విషయాన్ని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ తీసుకొచ్చిన కార్యకర్తల బీమా పథకం ద్వారా రూ.2 లక్షల బీమా చెక్కును నందూగౌడ్ తండ్రి దయానంద్‌గౌడ్‌కు కిషన్‌రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు పూజారి చక్రవర్తి, వార్డు సభ్యులు పెంటేశ్యాదవ్, కోఆప్షన్ సభ్యుడు తొంట బాబు, బ్యాంకు డైరెక్టర్ రాములు, టీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు వెంకటేశ్‌యాదవ్, రవీందర్‌గౌడ్, ప్రవీణ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.