షాబాద్, సెప్టెంబర్ 14 : తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని స్టార్ గార్డెన్లో జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి, ఎంపీపీ కోట్ల ప్రశాంతిరెడ్డితో కలిసి మండలంలోని 41 గ్రామ పంచాయతీలకు సంబంధించి ప్రభుత్వం నుంచి మంజూరైన 932 ఆసరా పింఛన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ.. 70 ఏండ్ల కాలంలో ఏ ప్రభుత్వాలు, ఏ ముఖ్యమంత్రులు అమలు చేయని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతున్నదన్నారు. ఆసరా పథకం ద్వారా అందిస్తున్న రూ. 2016, రూ. 3016తో పేద కుటుంబాలకు కొండంత ధైర్యం లభిస్తుందని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వ ఎనిమిదేండ్ల పాలనలో చేవెళ్ల నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు.
జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి, ఎంపీపీ కోట్ల ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ.. పింఛన్లు రాలేదని ఎవరూ అధైర్యపడొద్దని, త్వరలో అన్ని గ్రామాల్లో అధికారులతో కలిసి పర్యటించి అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందేలా తమవంతు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ పి. కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ జడల లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వప్నారెడ్డి, మాజీ చైర్మన్ నక్క శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింగ్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ చల్లా శేఖర్‌రెడ్డి, వైస్ చైర్మన్ మద్దూరి మల్లేశ్, జిల్లా రైతుబంధు సమితి సభ్యుడు కొలన్ ప్రభాకర్‌రెడ్డి, మండల కన్వీనర్ మధుసూదన్‌రెడ్డి, ఎంపీడీవో అనురాధ, షాబాద్ సర్పంచ్ సుబ్రహ్మణ్యేశ్వరి, మండల కోఆప్షన్ సభ్యుడు చాంద్‌పాషా, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్‌గౌడ్, రాజేందర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, శ్రీరాంరెడ్డి, రమేశ్‌యాదవ్, తొంట వెంకటయ్య, మునీర్, దర్శన్, నర్సింహులు, నాని, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాల్లో నెం.1 తెలంగాణ
ప్రజా సంక్షేమ పథకాల్లో దేశంలోనే నెం.1 తెలంగాణ రాష్ట్రమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల మండల పరిధిలోని దేవరంపల్లి, ఖానాపూర్, రేగడిఘనాపూర్, నాంచేరి గ్రామాల్లో బుధవారం లబ్ధిదారులకు నూతన పింఛన్ కార్డులను అందజేశారు. ప్రజా సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి, ఎంపీడీవో రాజ్‌కుమార్, వైస్ ఎంపీపీ శివప్రసాద్, సర్పంచ్‌లు నరహరిరెడ్డి, కె.శ్రీలత, నర్సింహులు, కె.సక్కుబాయి, కౌకుంట్ల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చింతకింది నాగార్జునరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, నాయకులు మిట్ట వెంకట రంగారెడ్డి, శేఖర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
వేడుకలను విజయవంతం చేయాలి
చేవెళ్లటౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో డివిజన్లోని ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్డీవో వేణుమాధవరావు, ఏసీపీ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.