పరిగి, సెప్టెంబర్ 14: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలలో భాగంగా ఈనెల 17వ తేదీన వికారాబాద్‌లోని పోలీసు పరేడ్ గ్రౌండ్లో జెండా ఆవిష్కరణకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల అధికారులను ఆదేశించారు. బుధవారం కలె క్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌హాలులో జిల్లా అధి కారులతో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రో త్సవాలలో భాగంగా పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో ఈనెల 17వ తేదీ ఉదయం 9 గంటలకు కార్య క్రమాన్ని ఘనంగా నిర్వహిం చాలని ఆదేశించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు హాజరవుతారని తెలిపారు. గ్రౌండ్లో వర్షపు నీరు నిలువకుండా చదును చేయాలన్నారు. ఈ సమా వేశంలో డీఆర్వో అశోక్‌కుమార్, జడ్పీ సీఈవో జానకీరెడ్డి, డీఆర్డీవో కృష్ణన్, డీటీడీవో కోటాజీ, ఆర్డీవో విజ యకుమారి, డీఈవో రేణుకాదేవి, డీవైఎస్వో హన్మంత్‌రావు, ఆర్అండ్బీ ఈఈ లాల్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
విజయవంతంగా నిర్వహించాలి
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అన్ని జిల్లాల్లో విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సూచించారు. బుధవారం హైదరా బాద్ నుంచి డీజీపీ మహేందర్‌రెడ్డి, రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలపై జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిఖిల, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
వజ్రోత్సవాల ఏర్పాట్లు చేసుకోవాలి
ఈనెల 16 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న తెలం గాణ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా జరిపేందుకు అన్ని మండలాల్లో ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ్ల కలెక్టర్ నిఖిల సూచించారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవ న్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరె న్స్ హాలులో అన్ని మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్లతో వజ్రోత్సవాల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ 16వ తేదీన ర్యాలీలో ప్రతిఒక్కరు పాల్గొనేలా చూడాల న్నారు. ర్యాలీలో పాల్గొనే వారికి తాగునీరు, భోజన ఏర్పాట్లు చేయాలని సూచించారు. 17న హైదరాబాద్‌లో జరిగే కార్య క్రమానికి ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులను తర లించాలని, ఇందుకుగాను 27 బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కు మార్, జడ్పీ సీఈవో జానకీరెడ్డి, ఆర్డీవో విజయకుమారి, డీఈ వో రేణుకాదేవి, జిల్లా యువజన సర్వీసుల శాఖ అధికారి హన్మంత్‌రావు తదితరులు పాల్గొన్నారు.