నందిగామ, సెప్టెంబర్ 10 : పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండలంలోని నందిగామ, మేకగూడ, రంగాపూర్, చాకలిగుట్టతండాలకు చెందిన 318 మందికి, కొత్తూరు మండలంలోని తీగాపూర్, మల్లపూర్, మల్లపూర్ తండా, మక్తగూడ, గూడురు గ్రామాలకు చెందిన 86 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన నూతన ఆసరా కార్డులను శనివారం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో జరుగని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్నాయన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ లబ్ధిపొందుతున్నారని తెలిపారు. ఆసరా పింఛన్ల ద్వారా ఎంతో మంది పేదలకు ప్రభుత్వ అండగా నిలుస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఆసరా కార్డులను పంపిణీ చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, ఎంపీపీలు ప్రియాంకగౌడ్, మధుసూదన్‌రెడ్డి, వైస్ ఎంపీపీ మంజూలనాయక్, శోభ, మాజీ ఎంపీపీ శివశంకర్‌గౌడ్, సర్పంచ్‌లు జిల్లెల వెంకట్‌రెడ్డి, గోవిందు అశోక్, రాజునాయక్, రమేశ్‌గౌడ్, రాజు, సాయిలు, సత్తయ్య, పాండురంగారెడ్డి, రామదేవి, పీఏసీఎస్ చైర్మన్ మంజూలరెడ్డి, వైస్ చైర్మన్ పద్మారావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పద్మారెడ్డి, కృష్ణయాదవ్, ఎంపీటీసీలు చంద్రపాల్‌రెడ్డి, కుమారస్వామిగౌడ్, రాజునాయక్, ఎంపీడీవోలు బాల్‌రెడ్డి, శరత్చంద్రబాబు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ..
కొత్తూరు మండలం మల్లపూర్ గ్రామానికి చెందిన జంగారెడ్డికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.2లక్షల చెక్కును ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ లబ్ధిదారుడికి అందజేశారు. అదే విధంగా కొత్తూరు మండలంలోని రెండు రైతు కుటుంబాలకు రైతు బీమా ద్వారా వచ్చిన రూ.5లక్షల విలువ గల ప్రొసీడింగులను అందజేశారు.
సీఎం సహాయనిధి పేదలకు వరం
సీఎం సహాయనిధి పేదలకు వరమని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. పట్టణానికి చెందిన 17మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను శనివారం అందజేశారు. పట్టణంలోని పద్మావతికాలనీకి చెందిన నరేందర్‌కు రూ. లక్షా50వేలు, రత్నమాలకు రూ. 60వేలు, శ్రీనివాసకాలనీకి చెందిన అంజాద్‌ఖాన్‌కు రూ. 60వేలు, ఆర్టీసీకాలనీకి చెందిన కార్తీక్‌కు రూ.60వేలు, లక్ష్మీనర్సింహకాలనీకి చెందిన బాలకిష్టమ్మకు రూ. 60వేలు, క్రిస్టియన్కాలనీకి చెందిన అనీస్‌కు రూ. 60వేలు, నెహ్రూనగర్కాలనీ చెందిన జగదీశ్‌కు రూ. 56వేలు, తిరుపతికు రూ. 32వేలు, ప్యారడైస్కాలనీకి చెందిన వెంకటేశ్‌కు రూ. 50,500, గోల్డెన్పార్క్కాలనీకీ చెందిన ఇబ్రహీంకు రూ. 49వేలు, సోలిపూర్కు చెందిన మల్లేశ్యాదవ్కు రూ. 35,500, తిరుమల కాలనీకి చెందిన వేణుగోపాల్‌కు రూ.24వేలు, రైతుకాలనీకి చెందిన అర్చనకు రూ. 32వేలు, వివేకానందకాలనీకి చెందిన వెంకటేశ్‌కు రూ. 40వేలు, సఫీయాబేగానికి రూ.19వేలు, ఈశ్వర్‌కాలనీకి చెందిన పద్మచారికి రూ. 32వేలు, మహమూద్నగర్కాలనీకి చెందిన హురాబీకు రూ. 18,500ల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సహాయనిధి ద్వారా నిరుపేదలకు మెరుగైన వైద్యం అందుతుందన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ పని చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, కౌన్సిలర్ నర్సింహ, నాయకులు కిషోర్, యాదగిరి పాల్గొన్నారు.