చేవెళ్ల రూరల్, సెప్టెంబర్ 8 : పేదల పక్షపాతి సీఎం కేసీఆర్ అని, సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల మండల పరిధిలోని మల్లారెడ్డిగూడ, పామెన, చన్వెల్లి, బస్తేపూర్ గ్రామాల్లో నూతన ఆసరాపింఛన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాలె యాదయ్య ముఖ్య అతిథిగా హాజరై ఎంపీపీ విజయలక్ష్మితో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆసరా పింఛన్లతో పేదల బతుకులకు భరోసా కల్పిస్తున్న సీఎం కేసీఆర్‌కు అందరూ రుణపడి ఉండాలని, పేదల సంక్షేమానికి సంక్షేమ పథకాలు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు మల్గారి మోహన్‌రెడ్డి, నర్సింహులు, పద్మ, మల్లారెడ్డి, ప్రణతి, నరహరిరెడ్డి, ఎంపీటీసీ రవీందర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, సివిల్ సైప్లె డైరెక్టర్ రవీందర్, నాయకులు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
దేశానికే ఆదర్శం సంక్షేమ పథకాలు
మొయినాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని అజీజ్‌నగర్ గ్రామంలో కొత్త పింఛన్ల మంజూరు పత్రాలను ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్‌తో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు అడుగకముందే వారి అవసరాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుసుకుని సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో సంధ్య, ఎంపీవో వెంకటేశ్వర్‌రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి దీపాలత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు జయవంత్, ఎంఏ రావూఫ్, సీనియర్ నాయకులు కొత్త నర్సింహారెడ్డి, మాజీ ఎంపీటీసీ మాణిక్‌రెడ్డి పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం
శంకర్పల్లి : పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం శంకర్పల్లి మండలంలోని శేరిగూడ, కొండకల్, మోకిల గ్రామాల్లో ఆసరా పింఛన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం పథకాలను ప్రవేశపెడుతున్న సీఎం కేసీఆర్‌కు ప్రజలు ఎల్లప్పుడూ మద్దతుగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ, సర్పంచ్‌లు సత్యనారాయణ, లావణ్య, నర్సింహారెడ్డి, సత్యనారాయణరెడ్డి, సుమిత్ర, సంతోషి, అశ్విని, ఎంపీటీసీలు సరిత, రాజు, ప్రవళిక, ఎంపీడీవో వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.