మర్పల్లి, ఆగస్టు 26 : అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యే యమని జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం మండలంలోని పట్లూర్‌లో 18 2, మొగిలిగుండ్లలో 29 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం మం జూరు చేసిన ఆసరా పింఛన్ గుర్తింపు కార్డులు, మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2018 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య పింఛన్ అర్హత వయస్సును 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గించి ఆసరా పింఛన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. పింఛన్లు రానివారు నిరాశపడొద్దని అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేస్తామ న్నారు. పింఛన్లు రానివారు ఈ నెల 30వ తేది వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం 75వ స్వతం త్ర వజ్రోత్సవాల సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలు, ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికీ బహుమతులు అంద జేశారు. మర్పల్లి పీఏసీఎస్ మాజీ చైర్మన్ ప్రభాకర్‌గుప్తా తల్లి ప్రమీలాదేవి అనారోగ్యంతో గురువారం మృతి చెందింది. ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో సర్పం చ్ ఇందిరా అశోక్, ఎంపీటీసీ స్వప్న సురేశ్, జడ్పీటీసీ మధుకర్, వైస్ ఎంపీపీ మోహన్‌రెడ్డి, ఎంపీడీవో జగన్నాథ్‌రెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు సోహెల్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు నాయబ్‌గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు అశోక్, ప్రధాన కార్యదర్శి రాచన్న, యూత్ అధ్యక్షుడు మధుకర్, ఆయా గ్రామాల సర్పంచులు శ్రీనివాస్, నూరోద్ధీన్, జైపాల్‌రెడ్డి, పాండు, ఎంపీటీసీలు మల్లేశం, రవీందర్, నాయకులు అశోక్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలల్లో పనులు పూర్తి చేయాలి
మన ఊరు మన బడిలో ఎంపికైన పాఠశాలల్లో పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మన ఊరు మన బడి పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించి, సుందరీకరణ చేయాలని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో వికారాబాద్ నియోజకవర్గం లోని డీఈలు, ఏఈలు, ఎంఈవోలు, ఆయా శాఖల అధికా రులు పాల్గొన్నారు.