షాద్‌నగర్‌టౌన్, మార్చి 8 : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని షాద్‌నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ జయంత్‌కుమార్‌రెడ్డి, కౌన్సిలర్లతో మున్సిపల్ చైర్మన్ నరేందర్ కలిసి మహిళా కౌన్సిలర్లు, మున్సిపల్ కార్మికులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. డీఎం సురేఖ ఆధ్వర్యంలో బస్టాండ్ ఆవరణలో నిర్వహించిన వేడుకలకు షాద్‌నగర్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి రాజ్యలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ నరేందర్ మాట్లాడుతూ. సృష్టికి మూలం స్త్రీ అని.. స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయమని పేర్కొన్నారు.
పెద్దఅంబర్‌పేట, మార్చి 8 : మున్సిపాలిటీ పరిధిలో పలువురు ఆశ వర్కర్లు, శానిటేషన్ సిబ్బందిని టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు చెరుకూరి రేణుక సన్మానించారు. ఆశ వర్కర్లు, స్థానిక మహిళలు రేణుకను సన్మానించారు.
చేవెళ్లటౌన్, మార్చి 8 : చేవెళ్ల మండల పరిషత్ కార్యాలయంలో చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ కృష్ణారెడ్డి, సర్పంచ్ శైలజ మహిళలను సన్మానించారు. కమ్మెట గ్రామంలోని డ్వాక్రా సంఘం మహిళలు, ఆశవర్కర్లు, మహిళా టీచర్లకు అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో సర్పంచ్ తులసిరాజు, ఉపసర్పంచ్ కృష్ణ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
హయత్‌నగర్ రూరల్, మార్చి 8 : మున్సిపాలిటీ పరిధిలోని ఆర్కేనగర్లో కౌన్సిలర్ మండల కోటేశ్వర్రావు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన వేడుకల్లో పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ చైర్పర్సన్ స్వప్న పాల్గొన్నారు. మున్సిపాలిటీ కార్మికులతోపాటు మహిళలను సత్కరించారు. చీరెలు పంపిణీ చేశారు.
మంచాల మార్చి 8 : కాగజ్‌ఘాట్, ఇబ్రహీంపట్నం గ్రామాల్లో, కందుకూరు రెవెన్యూ డివిజన్లో పరిధిలో పనిచేస్తున్న వివిధ స్థాయిలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను ఇబ్రహీంపట్నం ఆర్డీవో వెంకటాచారి సన్మానించారు.
మాడ్గుల, మార్చి 8 : మాడ్గుల పోలీస్‌స్టేషన్ ఆవరణలో జరిగిన వేడుకల్లో పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్లు పారిజాతం, నాగమణి, లావణ్య, హోంగార్డు అనిత, సిబ్బంది యాదమ్మను సీఐ కృష్ణమోహన్, ఎస్సై సత్కరించి, బహుమతులు ప్రదానం చేశారు.
మొయినాబాద్, మార్చి 7 : ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందిని ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ శ్రీకాంత్ సన్మానించారు. మండల పరిషత్ కార్యాలయం ఆవరణలోని మండల మహిళా సమాఖ్యలో మహిళా పొదుపు సంఘాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చినవారిని సన్మానించారు. అమ్డాపూర్‌లో సర్పంచ్ రవళి, హిమాయత్‌నగర్‌లో సర్పంచ్ మంజుల, చిలుకూరులో సర్పంచ్ గునుగుర్తి స్వరూప ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు.
యాచారం, మార్చి 8 : తక్కళ్లపల్లి గ్రామంలో సర్పంచ్ సంతోష ఆధ్వర్యంలో మహిళా ప్రజాప్రతినిధులు కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకొన్నారు. గ్రామపంచాయతీ సిబ్బందిని సన్మానించి, ఒకరికొకరు స్వీట్లు పంచుకొని సంతోషం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో ఐద్వా సంఘం జిల్లా నాయకురాలు అరుణ ఆధ్వర్యంలో దినోత్సవాన్ని నిర్వహించారు.
తుర్కయాంజాల్, మార్చి 8 : తుర్కయాంజాల్ మున్సిపాలిటీ కమ్మగూడ 22వ వార్డు కౌన్సిలర్ ఐలయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో చైర్ పర్సన్ అనురాధ, వైస్ చైర్పర్సన్ హరిత ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేశారు. పారిశుధ్య కార్మికులు, కాలనీ మహిళలను సన్మానించారు.
ఇబ్రహీంపట్నంరూరల్, మార్చి 3 : ఇబ్రహీంపట్నంలో నవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకొన్నారు. పటేల్‌గూడలో ఉపాధ్యాయినులను సన్మానించారు. పలు డిగ్రీ, జూనియర్ కళాశాలలు, పాఠశాలలు ఉపాధ్యాయినులను అధ్యాపకులు, విద్యార్థులు సన్మానించారు. అంధుల ఆశ్రమంలో సర్పంచ్‌లు పండ్లు పంపిణీ చేశారు. ఉప్పరిగూడలో టీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు వీరేశ్‌కుమార్ ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు, ఏఎన్ఎమ్లను సన్మానించారు.
శంకర్పల్లి, మార్చి 8 : స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శంకర్పల్లి చైర్పర్సన్ విజయలక్ష్మి, మహిళా కౌన్సిలర్లను సన్మానించి, వారితో కలిసి కేక్ కట్ చేశారు. అంతకు ముందు సామాజిక సామరస్యత ఆధ్వర్యంలో శంకర్‌పల్లిలోని మార్కెట్లో కూరగాయలు అమ్మే మహిళలను సన్మానించారు. గోపులారంలో జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు, సర్పంచ్ శ్రీనివాస్ ఆశ వర్కర్లను సత్కరించారు.
కడ్తాల్, మార్చి 8 : మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో యువజన సంఘాల ఐక్య వేదిక, వివేకానంద యూత్ సంయుక్త ఆధ్వర్యంలో వేడుకల్లో యువజన సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ రాఘవేందర్ పాల్గొన్నారు. ఉపాధ్యాయినులను సన్మానించి, ఉపాధ్యాయులు, విద్యార్థినులచే కేక్ కట్ చేయించారు. అంతకుముందు వివేకానంద మార్గ్‌లో విద్యార్థినులు మొక్కలు నాటారు. పాఠశాలలో విద్యార్థినులకు ఆటలపోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులను అందజేశారు. విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
అబ్దుల్లాపూర్‌మెట్, మార్చి 8 : మండల మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీపీ రేఖ హాజరై సంఘ మహిళలను సన్మానించారు. కవాడిపల్లిలో సర్పంచ్ సుజాత కేక్ కట్ చేసి పంచాయతీ సిబ్బందిని సన్మానించారు. కేసీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టి జైకొట్టారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ శ్వేత ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, ఆరోగ్య సిబ్బందిని సన్మానించారు.