ఆలయంలో దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు
కల్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్
కడ్తాల్, మార్చి 8 : మండల పరిధిలోని చరికొండ గ్రామంలో కొలువైన వేణుగోపాలస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయంలో రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారి పరిణయత్సోవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామివారిని శుద్ధజలం, పంచామృతాలతో అభిషేకించి పూజారుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. స్వామివారికి సమర్పించే పట్టు వస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను గ్రామంలోని ప్రధాన వీధులగుండా ఊరేగించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల కరతాళ ధ్వనుల మధ్య స్వామివారి కల్యాణం కనులపండువగా జరిగింది. ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, భక్తులు అధికసంఖ్యలో హాజరై కల్యాణోత్సవాన్ని తిలకించారు. అనంతరం తీర్థప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఆలయంలో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు భారతమ్మ, లోకేశ్‌నాయక్, ఎంపీటీసీ రాములుగౌడ్, ఉప సర్పంచ్ నరేశ్, టీపీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, మాజీ జడ్పీటీసీ హరిప్రసాద్, నాయకులు నర్సింహగౌడ్, లక్ష్మయ్యగౌడ్, భీష్మాచారి, అశోక్‌గౌడ్, బాలకృష్ణాగౌడ్, జంగయ్యగౌడ్, లక్ష్మి, కొమురమ్మ, సత్యశీలారెడ్డి, యాదయ్య, వెంకటయ్య, కరుణాకర్, దుర్గయ్య, సాబేర్, నరేశ్‌గౌడ్, కృష్ణయ్య ఉన్నారు.