జడ్పీటీసీ దశరథ్నాయక్
కడ్తాల్, మార్చి 8 : గ్రామాలు, తండాల్లో చేపట్టే అభివృద్ధి పనుల్లో పార్టీలకతీతంగా ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని జడ్పీటీసీ దశరథ్నాయక్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని సాలార్పూర్ గ్రామంలో మండల పరిషత్ నిధులు రూ.2లక్షలతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను సర్పంచ్ విజయలక్ష్మి, ఎంపీటీసీ ప్రియతో కలిసి జడ్పీటీసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాలు, తండాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. గిరిజన తండాలు ప్రత్యేక గ్రామపంచాయతీలుగా మారడంతో శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్నాయన్నారు. టీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు, తండాలు పూర్తిగా మారిపోయాయని పేర్కొన్నారు. ప్రత్యేక జడ్పీ నిధులతో మండలంలోని గ్రామాలు, తండాల్లో మౌలిక వసతులను కల్పిస్తానని జడ్పీటీసీ తెలిపారు. కార్యక్రమంలో రేఖ్యాతండా సర్పంచ్ హరిచంద్నాయక్, మాదారం సర్పంంచ్ సులోచన, మాజీ ఎంపీపీ పంతూనాయక్, ఉప సర్పంచ్ శ్రీశైలం పాల్గొన్నారు.