ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్
ఆమనగల్లు, మార్చి 6 : చిరువ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఎమ్మె ల్యే జైపాల్‌యాదవ్‌కు పలువురు చిరువ్యాపారులు తమ సమస్యను విన్నవించారు. ఆమనగల్లు బ్లాక్ మండలాలకు ముఖ్య కూడలిగా ఉన్న పట్టణంలో శాశ్వతంగా వ్యాపారం చేసుకోవడానికి తమకు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కలగా మారిందని, తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని వారు ఎమ్మెల్యేని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఆమనగల్లు మండల కేంద్రంలో అభివృద్ధి పనులకు కొందరు తమ స్వార్థం కోసం అడ్డంకులు సృష్టిస్తున్నారని, అందువల్లే అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతున్నదన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా అభివృద్ధిని ఆపేదిలేదని, తప్పనిసరిగా మం డల కేంద్రంలో చిరువ్యాపారుల కలను నెరవేరుస్తానని హామీనిచ్చారు. ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి ప్రధాన రోడ్ల విస్తరణలో భాగంగా దుకాణాలు, నివాస స్థలాలు కో ల్పోయే వారికికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రోడ్డు విస్తరణలో దుకాణాలు కోల్పోయే వారికి ఆ స్థలంలోనే దుకాణాల సముదాయాలను నిర్మించేందుకు కృషి చేస్తానని భరో సా ఇచ్చారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీనివాస్, చిరువ్యాపారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
తలకొండపల్లి : బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. మండలంలోని దేవునిపడకల్ గ్రామానికి చెందిన రజితకు రూ. 36 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరైంది. ఆ చెక్కును ఆదివారం బాధితు కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ తిరుపతి, నాయకులు సత్యం, వెంకటయ్య, నర్సింహ, సత్తయ్య పాల్గొన్నారు.