ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి
తలకొండపల్లి, ఫిబ్రవరి 28 : ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు సౌకర్యం కల్పించి, గ్రామాలను అబివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, అన్నారు. మల్లప్పగుట్టపై ఉన్న దేవాలయానికి రూ.75 లక్షలతో ఏర్పాటు చేసిన సీసీరోడ్డు, ఆమనగల్లు మార్కెట్ కమిటీ చెర్మన్ శ్రీనివాస్‌రెడ్డి నిర్మించిన ముఖద్వారం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి కుటుంబం ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలతో లబ్ధి పొందుతున్నదని తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. తలకొండపల్లి నుంచి ఆమనగల్లు వరకు 18 కిలోమీటర్ల రోడ్డుకు రూ. 37 కోట్ల్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈజీఎస్ ద్వారా నియోజకవర్గంలోని తలకొండపల్లి మండలానికి రూ.1.20 కోట్లు, కడ్తాల్ మండలానికి రూ.1.25 కోట్లు, మాడ్గుల మండలానికి రూ.1. 5 కోట్లు, కల్వకుర్తి మండలానికి రూ.1. 40 కోట్లు, చారకొండ మండలానికి రూ.1.65 కోట్ల చొప్పున సీసీ రోడ్లకోసం నిధులు మంజూరయ్యాయని తెలిపారు. కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్యలో భాగంగా తలకొండపల్లి మండలంలో 20, కడ్తాల్‌లో 12, మాడ్గులలో 17, చారకొండలో 3, కల్వకుర్తిలో 20, వెల్దండ మండలంలో 20 చొప్పున పాఠశాలలు మంజూరయ్యాయని తెలిపారు. తలకొండపల్లి మండల కేంద్రంలో రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయే వారికి ప్రభుత్వం ద్వారా డబుల్బెడ్రూం ఇండ్లను మంజూరు చేయిస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో ఆమనగల్లు మార్కెట్ కమిటీ చెర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌లు స్వప్న, కిష్టమ్మ, ఈశ్వర్‌నాయక్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ దశరథ్‌నాయక్, ఎంపీటీసీ వందన, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్, మాజీ జడ్పీటీసీ నర్సింహ పాల్గొన్నారు.