కేశంపేట, జూన్ 20 : రైతన్నల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నదని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలంలోని కొత్తపేటలో సోమవారం ప్రభుత్వం రూపొందించిన వ్యవసాయ-వ్యవసాయ అనుబంధ రంగాలపై వ్యాస దీపిక పోస్టర్‌ను ఎమ్మెల్యే విడుదల చేసి మాట్లాడారు. ఈ వ్యాస దీపిక ద్వారా రైతులు తక్కువ పెట్టుబడితో వ్యవసాయం చేసి అధిక లాభాలను ఆర్జించవచ్చని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ నవీన్‌కుమార్, ఎంపీటీసీ మల్లేశ్‌యాదవ్, మండల కోఆప్షన్ మెంబర్ జమాల్‌ఖాన్, ఉపసర్పంచ్ నరేశ్, ఏఈవో రాములు, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మయ్య, జగన్‌రెడ్డి, యాదయ్యగౌడ్, గణేశ్‌గౌడ్, దశరథం, మహేశ్‌గౌడ్, శ్రీను, సలీం, కుతుబుద్దీన్, రైతులు పాల్గొన్నారు.
వైభవంగా బీరప్ప స్వామి కల్యాణం
నందిగామ, జూన్ 20: మండలం పరిధిలోని వెంకమ్మగూడ గ్రామంలో చేగూరు పీఏసీఎస్ చైర్మన్, కురమ సంఘం మండల అధ్యక్షుడు గొర్లపల్లి అశోక్, గ్రామస్తుల ఆధ్వర్యంలో బీరప్పస్వామి కల్యాణం సోమవారం వైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పాల్గొని పూజలు చేశారు. కార్యక్రమంలో జడ్పీవైస్‌చైర్మన్ ఈట గణేశ్, సర్పంచ్ రజనీతవీరేందర్గౌడ్, మాజీ ఎంపీపీ శివశంకర్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ అశోక్, మాజీ చైర్మన్ విట్టల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పద్మారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్‌ఫండ్‌తో చెక్కుల పంపిణీ
నర్సప్పగూడ గ్రామానికి చెందిన అరుణమ్మకు సీఎం రిలీఫ్‌ఫండ్ ద్వారా మంజూరైన రూ.60వేలు, రూ.44వేల చెక్కులను ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, సర్పంచ్ గోవిందు అశోక్‌తో కలిసి లబ్ధిదారులకు అందజేశారు.