కేశంపేట, జూన్ 13: ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్ష్మి సూచించారు. సోమవారం ఆమె కేశంపే ట ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆకస్మికంగా తని ఖీ చేశారు. గర్భిణులు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రా ల్లో వైద్య పరీక్షలు చేయించుకుని.. కాన్పులు కూడా అక్కడే చేయించుకునేలా అధికారులు శ్రద్ధ తీసుకోవాలన్నారు. చిన్నారులకు డయేరియా ప్రబలకుండా ఓఆర్ఎస్, జింక్ మాత్రలతోపాటు తల్లిపాలను అందిస్తూ తక్షణ చికిత్సలు అందేలా చూడాలన్నారు. అనంతరం ఆమె సిబ్బంది పనితీరుపై అధికారులతో చర్చించి, పలు రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా ఆరోగ్య విస్తరణాధికారి శ్రీనివాస్, హెల్త్ ఎడ్యుకేటర్ ఆంజనేయు లు, సీనియర్ అసిస్టెంట్ హసన్, ఫార్మాసిస్ట్ రాగశ్రీ, స్టాఫ్ నర్సు నాగమ్మ, పుష్ప, సుందరి, హన్మంత్ పాల్గొన్నారు.