ఇబ్రహీంపట్నం, జూన్ 10: నియోజకవర్గంలో త్వరలోనే మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని, వాటి ద్వారా స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం అమెజాన్ సంస్థ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కృపేశ్ అధ్యక్షతన జరిగిన జాబ్‌మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పారిశ్రామికంగా నియోజకవర్గం అభివృ ద్ధి దిశలో ముందుకు సాగుతున్నదన్నా రు. ఇప్పటికే ఈ ప్రాంతంలో టీసీఎస్, బీడీఎల్తోపాటు పలు రక్షణ రంగ సం స్థలు వెలిశాయని.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీ యాచారం మండలంలో ఏర్పాటయ్యిందని, అది ప్రారంభమైతే ఈ ప్రాంతంలోని అనేకమంది నిరుద్యోగ యువతీయువకులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు. ఫార్మాసిటీ ఏర్పాటుకు భూములిచ్చిన ప్రతి కుటుంబంలో ఒక్కరికీ ఉద్యోగావకాశం లభిస్తుందన్నారు. అలాగే, ఇబ్రహీంప ట్నం సమీపంలోని తట్టిఖానా వద్ద క్లస్టర్పార్కు కూడా త్వరలోనే ఏర్పాటు కానున్నదని, ఇక్కడ పరిశ్రమల స్థాపన జరిగితే అనేకమంది ఈ ప్రాంతవాసులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు.
అలాగే.. ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడు, మంచాల మండలంలోని ప లు గ్రామాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, త్వరలో నే ప్రభుత్వం నుంచి ప్రకటన జారీ కానున్నట్లు ఆయన తెలిపారు. ఉద్యోగార్థులు ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించేందుకు కష్టపడి చదువాలని సూచించారు. నిరుద్యోగుల సౌకర్యార్థం ఎంకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఉచిత శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసినట్లు.. గతంలో ఈ ఫౌండేషన్‌లో శిక్షణ పొందిన అనేక మం ది ప్రభుత్వ ఉద్యోగాలను సాధించినట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి తెలిపారు. అమెజాన్ సంస్థలో ఉద్యోగాలు సాధించేందుకు అర్హులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అనంతరం ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపే శ్, జడ్పీటీసీ మహిపాల్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతీయువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జాబ్‌మేళాకు సుమారు 600 మంది నిరుద్యోగ యువతీయువకు లు హాజరయ్యారు. కార్యక్రమంలో మా ర్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, కేఎల్ గ్రూప్ మేనేజర్ పులదీప్, అమెజాన్ సంస్థ హెచ్ఆర్ఏ వీరభద్రం, ఎంపీడీవో క్రాంతికిరణ్, ఏపీఎం రవీందర్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.