కడ్తాల్, జూన్ 10 : గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని డీఎల్పీవో అమృత అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పల్లెప్రకృతి వనం, వైకుంఠధామం, నర్సరీని సందర్శించారు. ఈ సందర్భంగా డీఎల్పీవో మాట్లాడుతూ గ్రామంలో సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని తెలిపారు. అదేవిధంగా ఆమనగల్లు పట్టణంలో 15వ వార్డులో పారిశుధ్య పనులను మున్సిపల్ చైర్మన్ రాంపాల్‌నాయక్ పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు.
పట్టణ ప్రగతిలో భాగస్వాములు కావాలి
పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్మన్ రాంపాల్‌నాయక్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆమనగల్లు పట్టణంలోని 15 వార్డులో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్, కౌన్సిలర్ లక్ష్మణ్ పాల్గొన్నారు.
విస్తృతంగా పట్టణ ప్రగతి
పట్టణ ప్రగతి కార్యక్రమాలు షాద్‌నగర్ మున్సిపాలిటీలో విస్తృతంగా కొనసాగుతున్నాయని మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్ అన్నారు. మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో కొనసాగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమాలను శుక్రవారం కౌన్సిలర్లు, కమిషనర్ జయంత్కుమార్రెడ్డితో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్ విశ్వం, మున్సిపల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ సాయి, సిబ్బంది పాల్గొన్నారు.
పనులు పరిశీలించిన ఎంపీడీవో
చేవెళ్లలో సర్పంచ్ బండారు శైలజ, పంచాయతీ కార్యదర్శి వెంకట్‌రెడ్డితో కలిసి ప్రధాన రహదారికి ఇరువైపులా మొక్కలు నాటించి నీరు పోశారు. అనంతరం చేవెళ్లలో క్రీడా మైదానంలో మట్టిని లెవెలింగ్ చేయించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు, కార్యదర్శులు, స్పెషల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.
పల్లెప్రగతిలో భాగస్వాములవ్వాలి
పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని రుద్రారం సర్పంచ్ బండ స్వర్ణలత అన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులతో కలిసి రోడ్లను శుభ్రం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు సతీశ్‌యాదవ్, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి
పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని దామరిగిద్ద సర్పంచ్ వెంకటేశం గుప్తా అన్నారు. పల్లె ప్రగతి లో భాగంగా హరితహరం కార్యక్రమంలో నాటి న మొక్కలు కొన్ని చనిపోవడంతో వాటిని గుర్తించి వాటి స్థానంలో కొత్త మొక్కలను నాటి వాటికి జాలీలు ఏర్పాటు చేశారు.
పారిశుధ్య పనులు పరిశీలన
పట్టణ ప్రగతి లో భాగంగా అన్ని వార్డుల్లో వాటర్ ట్యాంకుల క్లీనింగ్, పారిశుధ్య పనులను మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి పరిశీలించారు. పరిసరాలను శుభ్రం గా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో కమిషనర్ యాదగిరి, వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, కౌన్సిలర్లు రాధా, సంతోష్, అశోక్, గోపాల్, రాములు, చంద్రమౌళి, శ్రీనాథ్ ఉన్నారు.
మొండిగౌరెల్లిలో..
మొండిగౌరెల్లి గ్రామంలో సర్పంచ్ బండిమీది కృష్ణ ఆధ్వర్యంలో మొక్కలు నాటా రు. ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించి గ్రామంలో నెలకొన్న ప్రధాన సమస్యలను గుర్తించారు. సమస్యల పరిష్కారానికి ప్రణాళికలను రూపొందించారు. హరితహారం మొక్కల వద్ద కలుపు మొక్కలను తొలగించి, పాదులు తీసి నీరు పోశారు. వైకుంఠదామం వద్ద పూల మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ యాదగిరిరెడ్డి, ఏపీవో లింగయ్య, స్పెషల్ ఆఫీసర్ నరసింహ, పంచాయతీ కార్యదర్శి దీపిక, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
జోరుగా పట్టణ ప్రగతి
14వ వార్డులో కౌన్సిలర్ రోహిణిరెడ్డి ఆధ్వర్యంలో చెత్త తొలగింపు పనులు పెద్దఎత్తున చేపట్టారు. 22వ వార్డు లో చైర్పర్సన్ చెవుల స్వప్న చిరంజీవి, కౌన్సిలర్ చెవుల హరిశంకర్ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతిపై స్థానికులకు అవగాహన కల్పించారు. అనంతరం మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కమిషనర్ రామాంజులరెడ్డి, అధికారులు అశోక్‌కుమార్, బల్వంత్‌రెడ్డి, ఉపేందర్, ఆర్పీ స్వప్న, నాయకులు రాములు, శ్రీను, నాగరాజు పాల్గొన్నారు.
అబ్దుల్లాపూర్‌మెట్, లష్కర్గౌడలో..
అబ్దుల్లాపూర్‌మెట్‌లో ర్యాలీ నిర్వహించి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అదేవిధంగా లష్కర్గౌడలో సర్పంచ్ పారిజాత ఆధ్వర్యంలో శ్రమదానం చేశారు. పాఠశాలలో శిథిలావస్థలో ఉన్న ఒక గదిని కూల్చారు. చెత్తాచెదారాన్ని తొలగించారు. కార్యక్రమాల్లో సర్పంచ్ కిరణ్‌కుమార్, జడ్పీటీసీ దాస్‌గౌడ్, ఎండీవో మమతాబాయి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.