షాద్‌నగర్‌టౌన్, మే 26 : షాద్‌నగర్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీలోని 5వ వార్డు సోలీపూర్ గ్రామానికి సంబంధించిన అంతర్గత మురుగు కాలువ నిర్మాణ పనులను గురువారం మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, కౌన్సిలర్ కృష్ణవేణితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పట్టణం ఎంతో సుందరంగా మారిందన్నారు. ఇప్పటికే అన్ని వార్డుల్లో సీసీరోడ్లు, అంతర్గత మురుగు కాలువలు, వీధి దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి ఇంటికీ మిషన్‌భగీరథ పైపులైన్ కనెక్షన్లు ఇవ్వడం జరిగిందన్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో రానున్న రోజుల్లో మున్సిపాలిటీ మరింత సుందరంగా మారనుందన్నారు. పట్టణాభివృద్ధితో పాటు త్వరలో నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ అంతర్గత మురుగు కాలువ నిర్మాణ పనులకు రూ. 8 లక్షలను వెచ్చిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, కౌన్సిలర్ శ్రీనివాస్, గ్రంథాలయ కమిటీ చైర్మన్ లక్ష్మీనర్సింహారెడ్డి, మండలాధ్యక్షుడు లక్ష్మణ్‌నాయక్, నాయకులు రఘునాథ్‌యాదవ్, శ్రీశైలం పాల్గొన్నారు.
కనుల పండువగా కల్యాణం
-స్వామి వారి కల్యాణంలో పాల్గొన్న ముస్లింలు
షాద్‌నగర్‌రూరల్: ఫరూఖ్‌నగర్ మండలంలోని రంగదాముల గ్రామంలో శ్రీరంగనాయక స్వామి దేవాలయంలో ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం శ్రీ భూనీలసమేత శ్రీ రంగనాయకస్వామి తిరుకల్యాణ మహోత్సవాన్ని ఆలయ అర్చకులు కనుల పండువగా నిర్వహించారు. కల్యాణమహోత్సవంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ముస్లింలు పాల్గొనడంతో వారిని ప్రత్యేకంగా అభినందించారు. నియోజకవర్గంలో కులమతాలకు అతీతంగా పండుగలు, పూజా కార్యక్రమాలు, ప్రతి కార్యక్రమం ఐకమత్యంతో జరుపుకోవడంతో షాద్‌నగర్ నియోజకవర్గం మరింత శోభను సంతరించుకుంటుందన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిం చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, సర్పంచ్ లలిత, ఎంపీటీసీ శ్రీశైలం, నాయకులు లక్ష్మణ్‌నాయక్, శ్యాం, రాము, ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.