కోట్‌పల్లి, మే 25 : పేదింటి ఆడ బిడ్డలకు కల్యాణలక్ష్మి వరమని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద 6 పంచాయతీలకు 20 మంది లబ్ధిదారులకు రూ.20,02,320 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి ద్వారా పేదింటి ఆడబిడ్డల కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నారన్నారు. రైతులకు పెట్టుబడి సాయం, రైతుబంధు, రైతుబీమా వంటి అద్భుతమైన పథకాలను ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్, వైస్ చైర్మన్ దశరథ్‌గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అనీల్‌కుమార్, బుగ్గాపూర్ సర్పంచ్ లక్ష్మీవెంకటయ్య, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు, సర్పంచులు రామచందర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి
తాండూరు రూరల్, మే 25 : మహిళలు క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే మైదానంలో మహిళా క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటల ద్వారా విద్యార్థినుల్లో మానసిక ఉల్లాసంతోపాటు శారీరక దారుఢ్యం పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్‌నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ దీపా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు నయీం, టీఆర్ఎస్ నాయకులు నర్సింహులు, శ్రీనివాసచారి పాల్గొన్నారు.
స్వయం ఉపాధితో యువత ఉపాధి పొందాలి
తాండూరు రూరల్, మే 25 : ప్రభుత్వం అందించే పథకాలతో యువత ఉపాధి పొందాలని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మంజూరైన ఎలక్ట్రిక్ ఆటోను బషీరాబాద్ మండలం, దామర్‌చెడ్ గ్రామానికి చెందిన లబ్ధిదారుడు తిరుపతయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ 60 శాతం సబ్సిడీపై లబ్ధిదారులకు ఆటో అందించడం అభినందనీయమన్నారు. యువత ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్‌నాయక్, పెద్దేముల్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, రాజన్న, సర్పంచ్‌లు ఉన్నారు.
పేదలకు భరోసా
నవాబుపేట, మే 25: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పేదలకు వరమని మైతాబ్‌ఖాన్‌గూడ సర్పంచ్ అనితారంగారెడ్డి అన్నారు. బుధవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా గ్రామస్తులకు మంజూరైన చెక్కులను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి ఎంతో భరోసాను ఇస్తుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు లింగంపల్లి రంగారెడ్డి, ఉప సర్పంచ్ జనార్దన్, జంగయ్య, బుచ్చిరెడ్డి, శంకరయ్య పాల్గొన్నారు.