బొంరాస్‌పేట, నవంబర్ 14 : కొడంగల్ ఫారెస్టు రేంజ్ పరిధిలోని మూడు మండలాల్లో నర్సరీ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. హరితహారంలో చేపట్టే మొక్కల పెంపకానికి కావాల్సిన మొక్కలను సెంట్రల్ నర్సరీల్లో పెంచుతున్నారు. మండలంలోని బొంరాస్‌పేట, కొత్తూరు, దౌల్తాబాద్ల్లో ఉన్న మూడు సెంట్రల్ నర్సరీల్లో ఈ మొక్కలను పెంచుతున్నారు. ఈ ఏడాది మూడు నర్సరీల్లో కలిపి 1.90 లక్షల మొక్కలను పెంచాలని లక్ష్యంగా నిర్దే శించారు. బొంరాస్‌పేటలో 80 వేలు, కొత్తూరులో 50 వేలు, దౌల్తాబా ద్లో 60 వేల మొక్కలను పెంచుతున్నారు. వీటిలో 1.16 లక్షలు అటవీ జాతు లకు సంబంధించిన మొక్కలుకాగా మిగతా 30 వేల మొక్కలు వెదురు మొక్కలు ఉన్నాయి. బ్యాగుల్లో మట్టిని నింపి విత్తనాలు నాటే పనులు దాదా పుగా పూర్తయ్యాయి.
ఈ ఏడాది నాటిన విత్తనాలు మొలకెత్తి ఏడాది వరకు నర్సరీల్లోనే మొక్కలను పెంచుతారు. ఈ విధంగా పెరిగిన మొక్కలను రెండో ఏడాది నాటడానికి సరఫరా చేస్తారు. నర్సరీల్లో కొద్దిగా మొక్కలు పెరిగిన తరువాత చిన్న బ్యాగుల్లో నుంచి పెద్ద బ్యాగుల్లోకి మారుస్తారు. సెట్రల్ నర్సరీల్లో పెంచిన మొక్కలను అటవీ శాఖ భూముల్లో, హరితహారంలో పలు చోట్ల నాటడానికి సరఫరా చేస్తారు. నర్సరీల్లో పెంచుతున్న మొక్కలకు ప్రతి రోజు నీళ్లు పోయడానికి, సంరక్షించడానికి కూలీలు, వాచర్లు పని చేస్తున్నారు. నర్సరీల్లో పెంచుతున్న మొక్కల సంరక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకుం టున్నామని, లక్ష్యం మేరకు మొక్కలు పెంచుతున్నామని ఫారెస్టు రేంజ్ అధికారి సవిత తెలిపారు.
ఇవి కాకుండా ప్రతి గ్రామ పంచాయతీలో హరితహారం కోసం ఉపాధి పథ కం కింద ఊరికో నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు. ఆ పను లు కూడా ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. ఎంపిక చేసిన స్థ లాలలో మట్టిని సేకరించడం, బ్యా గుల్లో ఎరువు, మ ట్టిని నింపి విత్తనాలు నాటే పనులు త్వరలో ప్రారంభంకానున్నా యి. ఊరికో నర్సరీలో 10 వేల చొప్పున మొక్కలను పెం చుతారు.