తుర్కయాంజాల్, నవంబర్ 14: రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతుబంధు సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి అన్నారు. పౌర సరఫరాల సంస్థ సహకారంతో జిల్లా మార్కెటింగ్ సంఘం లిమిటెడ్, రంగారెడ్డి జిల్లా (డీసీఎంఎస్) సంయుక్తాధ్వర్యంలో తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి తొర్రూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కొహెడ డీసీఎంఎస్ సెంటర్ కొనుగోలు కేంద్రాన్ని వంగేటి లక్ష్మారెడ్డి, ఏడీఏ సత్యనారాయణతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని, అందుకు కావాల్సిన కల్లాలను సిద్ధం చేశామన్నా రు. ధాన్యంలో తేమ 17శాతం కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలన్నారు. రైతులు కొనుగోలు కేంద్రానికి వచ్చేటప్పుడు ఆధార్‌కార్డు, పాస్ పుస్తకం, బ్యాంక్ అకౌంట్‌ను తీసుకురావాలని, ఆధార్ కార్డుకు ఫోన్‌నంబర్‌ను అనుసంధానం చేసి ఉంటే నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్నారు. రైతులు వరిలో నాణ్య త లోపించకుండా రాళ్లు, తాలు, గడ్డి, తేమ లేకుండా చూసుకోవాలన్నారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని ముందుగా కామన్ గ్రేడ్‌గా పరిగణించి సన్న, దొడ్డు రకా న్ని బట్టి ఏ గ్రేడ్‌లోకి వస్తే దాని ప్రకారం రూ.20 అదనంగా చెల్లించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో తుర్కయాంజాల్ ఎఫ్ఎస్సీఎస్ వైస్ చైర్మన్ కొత్తరాంరెడ్డి, డైరెక్టర్లు సామ సంజీవరెడ్డి, జక్క కృష్ణారెడ్డి, లక్ష్మమ్మ, యాదగిరి, కౌన్సిలర్లు స్వాతీఅమరేందర్రెడ్డి, మల్లేశ్, డీసీఎంఎస్ మేనేజర్ రామకృష్ణారాజు, ఏఈవో లక్ష్మణ్, సెంటర్ ఇన్‌చార్జ్‌లు గీత, రజిత, తొర్రూర్ రైతు బంధు సమితి కో-ఆర్డినేటర్ బాల్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.