కడ్తాల్, మే 10 : యాసంగిలో పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నదని, రైతులు కోసమే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ధాన్యాన్ని కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ధాన్యానికి సరిపడా గన్నీ బ్యాగులను ప్రభుత్వం అందజేస్తుందన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టిందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఆపాలని మద్రాస్‌లోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులు వేసింది కాంగ్రెస్, బీజేపీ నాయకులేనని విమర్శించారు. రైతులను అన్ని విధాల ఆదుకోవడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్‌నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, ఏంఎంసీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. మండలంలోని ముద్విన్ గ్రా మంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని మంజూరు చేయించారు. ఈ మేరకు మంగళవారం గ్రామంలోని పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యేని సర్పం చ్ యాదయ్య ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేయబోతున్నదన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు పని లేక, రాష్ట్రంలో ఉనికి కోల్పోతామనే భయంతో పాదయాత్రలు, సభలు నిర్వహిస్తున్నారని విమర్శించారు.
కర్కల్‌పహాడ్- చరికొండ రోడ్డుకు త్వరలో రెన్యూవల్ పనులను ప్రారంభిస్తామని, ముద్విన్-ఆకుతోటపల్లి గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మిస్తామని, ముద్విన్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనానికి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పరమేశ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ సత్యం, సర్పంచ్‌లు యాదయ్య, రవీందర్‌రెడ్డి, కృష్ణయ్యయాదవ్, తులసీరాంనాయక్, లోకేశ్‌నాయక్, భారతమ్మ, భాగ్యమ్మ, సుగుణ, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, శ్రీనివాస్‌రెడ్డి, మంజుల, ఉప సర్పంచ్‌లు రామకృష్ణ, వినోద్, ముత్యాలు, శారద, ఏఎంసీ డైరెక్టర్లు శ్రీనివాస్‌గుప్తా, లాయక్‌అలీ, నర్సింహాగౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్లు వీరయ్య, సేవ్యానాయక్, వెంకటేశ్, డోల్యానాయక్, వెంకటయ్య, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.