బొంరాస్‌పేట, మే 10 : రైతు సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్న దని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని బొంరాస్‌పేట, మెట్లకుంట, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రా రంభించారు. రేగడిమైలారం గ్రామంలో మొగుల్లబాయి వాడుకపై రూ. 13 లక్షల వ్య యంతో నిర్మించిన వంతెనను ప్రారంభించి, మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో మన ఊరు-మనబడి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాలలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం యాసంగి ధాన్యాన్ని కొనబోమని తేల్చి చెప్పినా రాష్ట్రంలో వరి పండించిన రైతులు నష్టపోరాదన్న ఉద్దేశంతో ప్రభుత్వానికి రూ. 3 వేల కోట్ల నష్టం వస్తున్నా ధాన్యాన్ని కొనుగోలు చేస్తు న్నదని చెప్పారు. రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్మకుండా కొనుగోలు కేంద్రాలను సద్వి నియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
మన ఊరు-మనబడి పథకం ద్వారా ప్రభు త్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పిస్తున్నామని, తొలి విడుతలో మండలం లోని 25 పాఠశాలలను ప్రభుత్వం ఎంపిక చేసి వాటి అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్న దని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి చెప్పారు. స్వంత స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకో వడా నికి ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తుందని, త్వరలో నియోజకవర్గానికి 3 వేల ఇండ్లు వస్తున్నాయని, ఇల్లు లేని వారికి ఇండ్ల మంజూరులో ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. బొంరాస్‌పేట నుంచి మెట్లకుంట మీదుగా లోతుకుంటతండా వరకు, రేగడి మైలారం నుంచి గిర్కబాయితండాకు, జాతీయ రహదారి నుంచి పరమేశ్వర దేవాలయం వరకు బీటీ రోడ్లు మంజూరు చేస్తామని, రేగడిమైలారం గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు.
కులాంతర వివాహం చేసుకున్న మెట్ల కుంట గ్రామానికి చెందిన రాజు, జ్యోతి దంప తులకు రూ.2.50 లక్షల ఆర్థిక సహాయం చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ హేమీబాయి, వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ నారా యణరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్య క్షుడు కోట్ల యాదగిరి, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు చాంద్‌పాషా, పార్టీ అధి కార ప్రతినిధి టీటీ రాములు, టీఆర్ఎస్ తాలుకా యూత్ అధ్యక్షుడు నరేష్‌గౌడ్, ఎంపీ టీసీలు తిరుప తయ్య, జగదీష్, సర్పంచ్‌లు నారాయణ, హన్మంతు, రాజేశ్వరి, పార్టీ నాయకులు రమణారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
దోమ, మే10: రైతులు దళారులను ఆశ్రయించి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాలని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం దోమ మండల కేంద్రంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డిప్యూటి కలెక్టర్ మోతీలాల్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభిం చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రైతులు దళారులను ఆశ్రయించి మోసపో కుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేం ద్రాలను ప్రారంభిస్తున్నదన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమం లో సర్పంచ్ రాజిరెడ్డి,ఎంపీటీసీ అనిత, ఎంపీపీ అనసూయ, వైస్ ఎంపీపీ మల్లేశం, రైతు బంధు సమి తి మండల కోఆర్డినేటర్ లక్ష్మయ్యముదిరాజ్, గ్రంథాలయ డైరెక్టర్ యాద య్యగౌడ్, రాజ గోపాలచారి, తహసీల్దార్ షాహెదాబేగం, ఎంపీడీవో జయరాం పాల్గొన్నారు.