ధారూరు,మే 8: గ్రామ ప్రజలు పాడిపంటలతో ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ఆదివారం ధారూరు మం డల పరిధిలోని కెరెళ్లి గ్రామంలో గ్రామదేవతలు మైసమ్మ, పోచమ్మ, ఊరడమ్మ, రుక్క మ్మ, గాలి పోచమ్మ, గ్రామ నాభిశిల, నాగదేవతల విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మికతతో ప్రశాంత జీవనం అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బి.విజయకుమార్, వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజులారమేశ్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు ఎన్. శుభప్రద్‌పటేల్, ధారూరు మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సంతోశ్‌కుమార్, గ్రామ సర్పంచ్ కె.నర్సింహా రెడ్డి, ఎంపీపీ జైదుపల్లి విజయలక్ష్మి , ధారూరు మండల మాజీ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, జడ్పీటీసి కోస్నం సుజాత, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజునాయక్, ప్రధాన కార్యదర్శులు కావలి అంజయ్య, రాజుగుప్తా, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు వెంకటయ్య, పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, మండల యువజన విభాగ అధ్యక్షుడు జైపాల్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు వీరేశం, నాయకులు వడ్ల నందు, హన్మంత్‌రెడ్డి, రాములు, విజయ్‌కుమార్, ప్రభాకర్ రెడ్డి, లక్ష్మయ్య ఉన్నారు.