కొందుర్గు, మే 8 : ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం జిల్లెడు చౌదరిగూడ మండల కేంద్రంలో కొందుర్గు పీఏసీఎస్ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోలు విషయంలో చేతులు ఎత్తేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతన్నలను కంటికి రెప్పలా కాపాడేందుకు ధ్యాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నదని ఆయన తెలిపారు. రైతు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని అన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ దామోదర్‌రెడ్డి, సీఈవో మహమూద్‌అలీ, జడ్పీటీసీ బంగారు స్వరూప, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హఫీజ్, సర్పంచ్‌లు బాబురావు, బాల్‌రాజ్, గోపాల్, ప్రేమ్‌కుమార్, వెంకటస్వామి, నాయకులు దూలయ్య, జబ్బార్, నర్సింహులు పాల్గొన్నారు.
బొడ్రాయి ప్రతిష్ఠాపనలో..
కొందుర్గు మండలంలోని ఉత్తరాశిపల్లిలో జరిగిన బొడ్రాయి ప్రతిష్ఠాపనలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పాల్గొని పూజలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ భక్తి భా వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమం లో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ రాజేశ్‌పటేల్, నాయకులు ఎదిర రామకృష్ణ పాల్గొన్నారు.