బషీరాబాద్, మే 7 : గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకుని, పరిష్కరించేందుకే పల్లెబాట కార్యక్రమం ద్వారా ప్రజల మధ్యకు వచ్చినట్లు ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని రెడ్డిఘణపూర్, మంతట్టి, మల్కన్‌గిరి, కాశీంపూర్ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ప్రజలడిగినా.. అడుగకపోయినా అభివృద్ధి చేసే బాధ్యత తమపై ఉందన్నారు. మండల అభివృద్ధికి రూ.5కోట్ల జడ్పీ నిధులు మంజూరు చేశామని గుర్తు చేశారు. మంతట్టి గ్రామం నుంచి తాండూరుకు వెళ్లేందుకు మార్గమధ్యం నుంచి రోడ్డు నిర్మించాలని గ్రామస్తులు కోరడంతో రోడ్డు నిర్మాణానికి నిధులు ఇస్తామని గ్రామస్తులకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, అజయ్‌ప్రసాద్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు శంకర్‌రెడ్డి, నాయకులు సుధాకర్‌రెడ్డి, మాణిక్‌రెడ్డి, శ్రవణ్‌కుమార్, రియాజ్, హన్మంతు పాల్గొన్నారు.
నాగులపల్లి గ్రామాభివృద్ధికి సహకరిస్తా
నాగులపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిపరచడానికి తన వంతు సహకారాన్ని అందిస్తానని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం నాగులపల్లి గ్రామంలో ‘పల్లె పల్లెకు ఎమ్మెల్సీ’ కార్యక్రమంలో భాగంగా పాల్గొని గ్రామస్తులతో సమావేశమై, గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాగులపల్లి నుంచి రొంపల్లి, నాగులపల్లి నుంచి ఇందోల్కు లింక్ రోడ్లకు, పెద్దమ్మ పానాది నుంచి గోరేమియా ఇంటి వరకు, బీసీ కాలనీలో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని గ్రామస్తులు లిఖితపూర్వకంగా కోరారు. అనంతరం తట్టేపల్లి గ్రామంలో పలువురు కార్యకర్తలను కలుసుకొని గ్రామాభివృద్ధిపై చర్చించారు. కార్యక్రమంలో సర్పంచ్ భాగ్యలక్ష్మి, ఉపసర్పంచ్ మల్రెడ్డి, ఎంపీటీసీ సురేఖ, తట్టేపల్లి, పెద్దేముల్ సొసైటీల చైర్మన్లు లక్ష్మారెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు బల్వంత్‌రెడ్డి, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు డీవై నర్సింహులు, నాయకులు బసంత్‌రెడ్డి, శ్రీను, రాంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శేఖర్, నాగరాజు పాల్గొన్నారు.
దవాఖానకు క్షతగాత్రుల తరలింపు
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు వ్యక్తులను ఓ ఆటోలో దవాఖానకు తరలించారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి. శనివారం తాండూరు నుంచి పెద్దేముల్ వైపునకు తన కారులో ఎమ్మెల్సీ వెళుతుండగా.. మార్గమధ్యంలో గాజీపూర్ బ్రిడ్జి వద్ద బైక్‌పై నుంచి ఇద్దరు వ్యక్తులు కిందపడి గాయాలపాలైన విషయాన్ని ఎమ్మెల్సీ గమనించారు. వెంటనే క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం తాండూరులోని జిల్లా దవాఖానకు తరలించేలా చొరవ చూపారు.