కడ్తాల్, మే 7 : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఎంబీఏ గార్డెన్స్‌లో తహసీల్దార్ మహేందర్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని 92 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని తెలిపారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు ఆర్థికసాయాన్ని అందించి తల్లిదండ్రులకు ప్రభుత్వం ఎంతో భరోసాను కల్పిస్తున్నదన్నారు. దేశం వెనుకబాటుకి కారణం కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయకులేనని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ విమర్శించారు. రెండు పార్టీలు పేద ప్రజలకు చేసింది ఏమిలేదని, బడాబాబులు, వ్యాపారస్తులకు కొమ్ముకాశాయని ఆరోపించారు.
వరంగల్ సభలో రాహుల్‌గాంధీ చేసిన డిక్లేరేషన్ని, తొలుత కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో అమలు చేసి చూపించాలని ఎమ్మెల్యే సవాలు విసిరారు. బండి సంజయ్ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్‌నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పరమేశ్, సర్పంచ్‌లు కృష్ణయ్యయాదవ్, తులసీరాంనాయక్, శంకర్, భారతమ్మ, భాగ్యమ్మ, విజయలక్ష్మి, కమ్లీ, సుగుణ, సులోచన, ఎంపీటీసీలు గోపాల్, లచ్చిరాంనాయక్, మంజుల, ప్రియ, ఉప సర్పంచ్ ఎల్లాగౌడ్, ముత్యాలు, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు వీరయ్య, ఏఎంసీ డైరెక్టర్లు లాయక్‌అలీ, నర్సింహాగౌడ్, నాయకులు చందోజీ, నారాయణ, లక్పతినాయక్, శంకర్‌నాయక్, రాజేందర్‌యాదవ్, నర్సింహాగౌడ్, చంద్రమోళి, జంగయ్యగౌడ్, బీచ్చానాయక్, బాబా, పంతూనాయక్, మహేశ్, సీఐ ఉపేందర్, ఎస్ఐ హరిశంకర్‌గౌడ్, ఆర్ఐ సురేందర్ పాల్గొన్నారు.