షాద్‌నగర్, మే 7 : ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఫరూఖ్‌నగర్ మండలం బుచ్చిగూడ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త మేడిపల్లి బల్వంత్‌రెడ్డి ఇటీవల కాలంలో మృతిచెందాడు. ఆయన భార్య మాధవికి శనివారం తన నివాసంలో ప్రమాదబీమా రూ. 2 లక్షల చెక్కును అందజేసి మాట్లాడారు. గతంలో బల్వంత్‌రెడ్డి పార్టీ సభ్యత్వం ఉన్నందున బీమా వర్తించిందన్నారు. బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్‌నాయక్, భూపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
హైమాస్ట్ లైట్లను ప్రారంభించిన ఎమ్మెల్యే
కొత్తూరు, మే 7: మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్‌లో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ శనివారం హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. హెచ్ఐఎల్ కంపెనీ సహకారంతో నేషనల్ హేవే 44పై తిమ్మాపూర్ చౌరస్తా, చేగూర్ రోడ్డు, ఎస్సీ కాలనీలో రూ. 5.50 లక్షలతో వీటిని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య, కౌన్సిలర్లు కొస్గి శ్రీను, ఎంపీటీసీ రాజేందర్‌గౌడ్, టీఆర్ఎస్ నాయకులు దేవేందర్‌యాదవ్, యాదయ్య, జనార్దన్‌రెడ్డి, శివకుమార్, రవినాయక్, యాదయ్య పాల్గొన్నారు.
మున్సిపల్ పాలకవర్గానికి సన్మానం
మున్సిపాలిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసి ఏడాది ఐన సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ వారిని ఘనంగా సన్మానించారు. సన్మానం పొందినవారిలో చైర్పర్సన్ లావణ్య, కౌన్సిలర్ శ్రీను, సోమ్లానాయక్, మాదారం నర్సింహాగౌడ్ ఉన్నారు.