షాద్‌నగర్‌టౌన్, మే 7 : పట్టణంలో 5కేంద్రాలతో పాటు ఫరూఖ్‌నగర్ మండలం మొగిలిగిద్ద జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఇంటర్ ఎగ్జామ్స్ కొనసాగుతున్నాయి. 1838మంది సాధారణ విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉన్నప్పటికీ 1740మంది విద్యార్థులు హాజరు కాగా, 98మంది గైర్హాజరయ్యారు. అదే విధంగా 480మంది ఒకేషనల్ విద్యార్థులకు 418మంది హాజరు కాగా, 62మంది గైర్హాజరైనట్లు కస్టోడియన్లు వి. శ్రీకాంత్, కిష్టప్ప ఒక ప్రకటనలో తెలిపారు.
శంకర్‌పల్లిలో..
శంకర్‌పల్లిలో పట్టణంలో శనివారం రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలకు 871 మంది హాజరయ్యారని కస్టోడియన్ వసంత తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు 779 గాను 50 మంది గైర్హాజరయ్యారని, అలాగే ఒకేషనల్ విద్యార్థులు 201కి గాను 59 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.