మర్పల్లి, మే 7: నాగరాజు కుటుంబానికి అండగా ఉంటామని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి తెలిపారు. మతాంతర ప్రేమ వివాహం చేసుకుని ఇటీవల హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో హత్యకు గురైన నాగరాజు భార్య, కుటుంబసభ్యులను శనివారం ఆయ న టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్‌తో కలి సి పరామర్శించి రూ.లక్ష ఆర్థికసాయాన్ని అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు జరుగడం చాలా బాధాకరమన్నారు. నాగరాజు కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం నుంచి రూ.8.5 లక్షల ఆర్థిక సాయం, ఆశ్రిన్‌కు ఉద్యో గం ఇప్పిస్తామని తెలిపారు.
మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు పరామర్శ
అదేవిధంగా మండలంలోని కొత్లాపూర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మల్లారెడ్డి రోడ్డు ప్రమాదంలో రెండు రోజుల క్రితం మరణించాడు. శనివారం ఎంపీ రంజిత్‌రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్ట ఆనంద్‌తో కలిసి కొత్లాపూర్ లోని మల్లారెడ్డి ఇంటికెళ్లి మల్లారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని తెలిపారు. వారి వెంట మండల ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.