తాండూరు, మే 5: రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్నదని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పి.మహేందర్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పి.రోహిత్‌రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణం ఆర్యవైశ్య కల్యాణ మండపంలో నియోజకవర్గంలోని తాండూరు పట్టణం, తాండూరు, యాలాల, బషీరాబాద్ మండలాలకు చెందిన 741 మంది లబ్ధిదారులకు రూ.7,41,85,965 కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ తెలంగాణ సర్కార్ బడుగు బల హీన వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. ఆసరా పింఛన్, రైతుల కోసం రైతు బంధు, రైతుబీమా, పేదల కోసం షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి వంటి పథకాలను ప్రవేశ పెట్టిన ఘనత టీఆర్ఎస్ పార్టీదేనని పేర్కొన్నారు.
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ నిధులతో పాటు ప్రత్యేక నిధులు తీసుకు వచ్చి తాండూరు నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆడపడచులకు అండగా ఉంటూ వారి పిల్లల పెండ్లిళ్లకు లక్ష నూట పదహారు రూపాయలు అందించి వారి కుటుంబంలో ఒకరిగా ఉంటున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, సబితా రెడ్డి సహకారంతో తాండూరుకు అధిక నిధులు తీసుకు వచ్చి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ తీర్చి సమస్యలు లేని తాండూరుగా మారుస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, వైస్ చైర్పర్సన్ దీప, తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్‌నాయక్, కోట్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్, పెద్దేముల్ ఎంపీపీ అనురాధ, పీఏసీఎస్ చైర్మన్ రవిందర్‌గౌడ్, సురేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు, గ్రామ సర్పంచ్‌లు, రెవెన్యూ అధికారులు ఉన్నారు.
గ్రంథాలు వేరైనా సారాంశం ఒక్కటే..
తాండూరు, మే5: మత గ్రంథాలు వేరైనా సారాంశం ఒక్కటేనని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. గురువారం తాండూరులో ముస్లిం సోదరులు నిర్వహించిన ఈద్ మిలాప్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లా డుతూ తో తాండూరు మతసామరస్యానికి నిలయంగా మారిందన్నారు. అందుకు అన్ని మతాల పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.