ఇబ్రహీంపట్నం, మే 3 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మంగళవారం రంజాన్ పర్వదిన వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాలతో పాటు తుర్కయాంజాల్, ఆదిబట్ల, పెద్దఅంబర్‌పేట్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లో ఉదయం ముస్లింలు ప్రార్థనా మందిరాల వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వివిధ పార్టీల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈద్గాల వద్ద ప్రార్థనల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇబ్రహీంపట్నం ఈద్గావద్ద మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, కౌన్సిలర్లు సుల్తాన్, నీల్ల భానుబాబు, జెర్కోని బాలరాజు, టీఆర్ఎస్ నాయకులు మహేశ్‌గౌడ్, మోహిజ్పాషా, ఆదిబట్ల కౌన్సిలర్ నిరంజన్‌రెడ్డితో పాటు తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.
షాబాద్ : చేవెళ్ల నియోజకవర్గంలో రంజాన్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల పరిధిలోని గ్రామా ల్లో రంజాన్ పండుగను పురస్కరించుకుని ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేపట్టడం సంతోషకరమని నాయకులు అన్నారు. చేవెళ్ల, శంకర్పల్లి మండలాల్లో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్యే రత్నం, ఇతర ప్రజాప్రతినిధులు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
షాద్‌నగర్ : షాద్‌నగర్, ఫరూఖ్‌నగర్, కొందుర్గు, చౌదరిగూడ, కేశంపేట, కొత్తూరు, నందిగామ మండలాల్లో ఈద్గాల వద్ద ముస్లింలు ప్రార్థనలు చేశారు. ఫరూఖ్‌నగర్ ఈద్గా వద్ద స్థానిక ముస్లింలు పెద్ద సంఖ్యలో ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ ఫరూఖ్‌నగర్ ఈద్గా, మొగిలిగిద్ద ఈద్గాల వద్ద పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, వివిధ పార్టీల నాయకులు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఫరూఖ్‌నగర్‌లో మిఠాయిలు పంచారు. పేద ప్రజలకు వస్ర్తాలను దానం చేశారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
కడ్తాల్ : ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల మండలాల్లో రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈద్గా వద్ద ప్రార్థనలు నిర్వహించారు. స్థానిక నాయకులు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు గోలీ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, ఎస్ఐ ధర్మేశ్, నాయకులు పత్యానాయక్, శ్రీనివాస్‌గౌడ్, చంద్రశేఖర్‌రెడ్డి, సుభాశ్, రాజు, ఖలీల్, జహంగీర్, రబ్బానీ, అలీం, కలీం, రవూఫ్, రఫీక్ పాల్గొన్నారు.