ఫ్యాబ్ సిటీలో వచ్చే ఏడాదిలోగా 40వేల మందికి ఉపాధి లభించనున్నదని రాష్ట్ర మున్సిపల్ అండ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పారిశ్రామికాభివృద్ధితో ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ ముందుకెళ్తున్నదన్నారు. కొత్తూరు మండలం పెంజర్లలోని అంతర్జాతీయ కాస్మోటిక్స్ ఉత్పత్తుల సంస్థ పీ అండ్ జీ పరిశ్రమలో లిక్విడ్ డిటర్జెంట్ ప్లాంట్, మహేశ్వరంలోని రావిర్యాల ఈ-సిటీలో రేడియంట్ ఎలక్ట్రానిక్ ప్లాంట్‌ను సోమవారం ఆయన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు, అందిస్తున్న ప్రోత్సాహంతో ఎన్నో బహుళజాతి కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయన్నారు. ప్రభుత్వం పీ అండ్ జీకి 170 ఎకరాలను కేటాయించగా.. 35 శాతం భూమిలోనే సంస్థ క్యాంపస్ ఉందని, వందశాతం భూమిని సద్వినియోగం చేసుకొని మరింత మంది యువతకు ఉపాధి కల్పించేలా చూడాలని నిర్వాహకులకు మంత్రి కేటీఆర్ సూచించారు.
రంగారెడ్డి, మే 2 (నమస్తే తెలంగాణ): పీఅండ్‌జీ పరిశ్రమ రాష్ట్రంలో రూ.200 కోట్లతో మొట్టమొదటి లిక్విడ్ డిటర్జెంట్ యూనిట్‌ను నెలకొల్పడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని పెంజర్ల గ్రామ సమీపంలో అంతర్జాతీయ కాస్మోటిక్స్ ఉత్పత్తుల సంస్థ పీఅండ్‌జీ పరిశ్రమలో లిక్విడ్ డిటర్జెంట్ ప్లాంట్‌ను ఆయన మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ఆరేండ్ల కితం పీ అండ్‌జీ పరిశ్రమను సీఎం కేసీఆర్ ప్రారంభించారని గుర్తు చేశారు. పీఅండ్‌జీ పరిశ్రమ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నదని, రాష్ట్రవ్యాప్తంగా రూ.1700 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. అదేవిధంగా పీఅండ్‌జీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం170 ఎకరాల భూమిని కేటాయించిందని, అయితే అందులో 35శాతం మాత్రమే పీఅండ్‌జీ క్యాంపస్ ఉందని, వంద శాతం భూములను వినియోగించుకుంటే స్థానికంగా ఉన్న ఆరు నుంచి ఏడు వేల మంది నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి లభిస్తుందని మంత్రి కేటీఆర్ నిర్వాహకులకు సూచించారు. కొవిడ్ సమయంలో పరిశ్రమ నిర్వాహకులు రూ.6 కోట్ల కొవిడ్ రిలీఫ్ ఫండ్‌తోపాటు రెండు లక్షలకు పైగా మాస్కులు, 20 వేలకుపైగా శానిటైజర్ బాటిళ్లను అందించినందుకు మంత్రి కేటీఆర్ వారికి ధన్యవాదాలు తెలిపారు. కొత్తూరు మండలం ఇన్ముల్‌నర్వ గ్రామంలో సొంత నిధులతో పాఠశాల భవనాన్ని నిర్మించిన పీఅండ్‌జీ పరిశ్రమ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, మహబూబ్‌నగర్ ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, పరిశ్రమల శాఖ కమిషనర్ కృష్ణభాస్కర్, పరిశ్రమల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఫ్యాబ్‌సిటీలో రాబోయే ఏడాదిలోపు..
వచ్చే ఏడాది లోపు ఫ్యాబ్‌సిటీలో 40 వేల మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల ఈ-సిటీలో రేడియంట్ ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌ను ఆయన మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ఆరేం డ్ల కింద ఫ్యాబ్ సిటీ ఏర్పాటు సమయంలో ఏమి అవుతుందోనని అందరూ అనుకున్నారని కానీ ఫ్యాబ్‌సిటీ ఏర్పాటుతో ప్రస్తుతం 15 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తున్నదని, రాబోయే ఏడాదిలోపు ఈ సంఖ్య 40 వేలకు చేరుతుందని పేర్కొన్నారు. రేడియంట్ సంస్థ 50 లక్షల టీవీలను ఇక్కడే తయారు చేయడం సంతోషమన్నారు. ఏడాదికి 4 లక్షల టీవీలను తయారు చేసే యూనిట్‌ను ఏర్పాటు చేద్దామనుకున్న ఆ సంస్థ నెలకు 4 లక్షల టీవీలను తయారు చేసే స్థాయికి ఎదుగడం ఎంతో గర్వకారణమన్నారు. ఆ సంస్థలో పనిచేసే వారిలో 53 శాతం మహిళలు ఉండగా, వారిలో 60 శాతం మంది మన తెలంగాణ వారే ఉన్నారన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తుల క్లస్టర్లు ప్రస్తుతం రెండు ఉన్నాయని, మరో రెండు ఏర్పాటు కానున్నట్లు మం త్రి చెప్పారు. కార్యక్రమంలో ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితాహరినాథ్‌రెడ్డి, రేడియంట్ సంస్థ ప్రతినిధులు రబీందర్సింగ్, మణికందన్, రాబిన్
తెలంగాణ వైపు అంతర్జాతీయ పరిశ్రమల చూపు..
పరిశ్రమల ఏర్పాటుకు జిల్లా అనుకూలంగా ఉండటంతో అంతర్జాతీయ పరిశ్రమలన్నీ తెలంగాణవైపు చూస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నా రు. రేడియంట్ సంస్థ ప్రతి 14 సెకన్లకు ఒక టీవీని తయా రు చేస్తుందని, ఐదు సెకన్లకు ఒక టీవీని తయారు చేసే స్థాయికి సంస్థ వెళ్లడం అభినందనీయమన్నారు. ఈ సంస్థ లో పనిచేసే వారిలో 60 శాతం మంది అమ్మాయిలే ఉన్నారని, వారంతా స్థానికులే కావడం సంతోషంగా ఉందన్నా రు. భవిష్యత్తులోనూ స్థానిక యువ తీయువకులకు ఉపా ధి కల్పించాలని నిర్వాహకులను కోరారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు చర్యలు తీసుకుంటుంటే… తెలంగాణను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషిని ప్రజలందరూ హర్షిస్తున్నారని కొనియాడారు.
-సబితాఇంద్రారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి
14 సెకన్లకు ఒక టీవీ..
రేడియంట్ సంస్థ 14 సెకన్లకు ఒక టీవీని తయారు చేస్తుందని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. సోనీ, ఎల్జీ టీవీలు మినహాయించి మిగతా అన్ని టీవీలు తెలంగాణలోనే తయారవుతున్నాయని తెలిపారు. దేశం మొత్తంలో 25 శాతం టీవీ లు రేడియంట్ సంస్థ నుంచే…తెలంగాణ రాష్ట్రంలోనే తయా రు కావడం సంతోషంగా ఉందన్నారు.
– రంజిత్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ
స్థానికులకు ఉపాధి కల్పించండి..
పీఅండ్‌జీ పరిశ్రమ ప్రతినిధులను కోరిన మహబూబ్‌నగర్ ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
స్థానికులకు ఉపాధి కల్పించి మా ప్రాంత అభివృద్ధికి కృషిచేయాలని మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పీఅండ్‌జీ పరిశ్రమ ప్రతినిధులను కోరారు. సోమవారం కొత్తూరు మండలం ఇన్ముల్‌నర్వ గ్రామంలో పీ అం డ్జీ పరిశ్రమ సీఎస్ఆర్ నిధుల నుంచి నూతనంగా నిర్మించిన పాఠశాల భవనా న్ని వారు ప్రారంభించి మాట్లాడారు. పీ అండ్‌జీ పరిశ్రమ చాలా పెద్దదని, అందు లో స్థానికులకు వృత్తి నైపుణ్యానికి అనుగుణంగా ఉపాధి అవకాశాలను కల్పించి ఆదుకోవాలని అన్నా రు. ఇప్పటికే ఈ ప్రాంతానికి చెందిన చాలామంది తమ భూములను అమ్ముకుని ఆర్థికంగా వెనుకబడిపోయారన్నా రు. అదేవిధంగా షాద్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి కూడా తమ వంతుగా కృషిచేయాలని పీఅండ్ జీ పరిశ్రమ హెచ్ఆర్ శ్రీనివాస్‌ను ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.7వేల కోట్ల నిధులతో సర్కారు బడుల బలోపేతానికి కృషి చేస్తున్నదని, విద్యార్థుల అభివృద్ధికి అందరూ సహకరించాలన్నారు. అనంతరం పీఅండ్‌జీ పరిశ్రమ హెచ్ఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ తమ పరిశ్రమ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 35 పాఠశాలలను ఇప్పటికే దత్తత తీసుకున్నామని, 100కు పైగా గదులను నిర్మించినట్లు తెలిపారు. సుమారు రెండు లక్షల మంది విద్యార్థులకు లబ్ధి జరిగేలా పరిశ్రమ చర్యలు తీసుకుంటున్నదన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, జడ్పీటీసీ శ్రీలత, ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి, సర్పంచ్ అజయ్‌కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, దేవేందర్‌యాదవ్, శ్రీనివాస్, మిట్టూనాయక్, పాపయ్యయాదవ్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.